ఖమ్మం

అధ్వాన్నంగా ప్రభుత్వ కార్యాలయాల రహదారులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏన్కూరు, ఆగస్టు 12: మండల కేంద్రంలో ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే రహదారులు ఎన్నో సంవత్సరాలుగా అధ్వాన్నంగా దర్శనమిస్తున్నా అధికారులు ఎవరు పట్టించుకోకపోవటం విచారకరం. మండల పరిషత్ కార్యాలయానికి ఎదురుగా ఉన్న వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయ రహదారి అంతా బురదగా మారి గుంతలు పడి అధ్వాన్నంగా ఉంది. నిత్యం కార్యాలయం గోదాములోని సివిల్ సప్లై కార్యాలయానికి లారీలతో బియ్యం సరఫరా చేస్తుంటారు. దీంతో కార్యాలయం ఎదుట బురదతో ఉన్న గుంతలో ఏన్నో సార్లు లారీలు దిగబడి డ్రైవర్లు, కూలీలు నానా యాతన పడుతున్నారు. అయినా అధికారులు ఎవరు పట్టించుకోవటం లేదు. వర్షం వస్తే కార్యాలయం లోకి వెళ్లాలంటే ప్రాణం మీదకు వస్తుందని గోదాము కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు ప్రభుత్వ కళాశాల, ఆసుపత్రి, విద్యుత్ కార్యాలయం, సివిల్‌సప్లై కార్యాలయంలోకి వెళ్లే రహదారులు సైతం ఎన్నో సంవత్సరాల నుండి అధ్వాన్నంగా ఉంటున్నాయి. అయినప్పటికి సంబందిత అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవటంతో ప్రజలు, విద్యార్థులు వర్షాకాలంలో యాతన అనుభవిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రహదారులు బాగు చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు.

రూ. 50 లక్షల సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన
ఖమ్మం(ఖిల్లా), ఆగస్టు 12: నగరంలోని 28వ డివిజన్‌లో 50లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణ పనులకు ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలోని అన్ని డివిజన్‌లలో సీసీ రోడ్ల ఏర్పాటుకు ప్రణాళికపరంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఖమ్మం నగరాన్ని సుందరీకరించేందుకు అవసరమైన పనులు చేపట్టడమే లక్ష్యంగా ముందుకు పోతున్నామన్నారు. కార్యక్రమంలో నగరమేయర్ డాక్టర్ జి పాపాలాల్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ, కార్పొరేటర్లు, టీఆర్‌ఎస్ పాల్గొన్నారు.
సీపీకి బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన సిబ్బంది
ఖమ్మం (ఖిల్లా), ఆగస్టు 12: త్యాగానికి ప్రతిరూపంగా నిలిచే బక్రీద్ పండుగను పురస్కరించుకొని పోలీస్ సిబ్బంది సోమవారం పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్‌ను కలసి శుభాకాంక్షలు తెలిపారు. ఈసందర్భంగా పోలీస్ కమిషనర్ కుటుంబ సమేతంగా పోలీస్ అధికారులకు, సిబ్బందికి స్వీట్లు అందజేశారు. సీపీని కలిసి వారిలో లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీసీపీ మురళీధర్, ట్రాఫిక్ ఏసీపీ సదానిరంజన్, ఆర్‌ఐలు శ్రీనివాస్, నాగేశ్వరరావు, రవి, సిఐ అంజలి ఉన్నారు. కాగా ఈద్గాలు, మసీదుల వద్ద పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి శాంతియుత వాతావరణంలో ప్రార్థనలు కొనసాగేలా పోలీస్ అధికారులు చర్యలు తీసుకున్నారు.