ఖమ్మం

బీజేపీ గూటికి టీడీపీ జిల్లా అధ్యక్షుడు కోనేరు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడెం, ఆగస్టు 12: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కోనేరు నాగేశ్వరరావు తనయుడు కోనేరు సత్యనారాయణ (చిన్ని) భారతీయ జనతా పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా సమక్షంలో ఈనెల 18వ తేదీన బిజేపీలో చేరేందుకు క్యాడర్‌ను సన్నద్ధం చేస్తున్నారు. కోనేరు చిన్ని బీజేపీలో చేరితే జిల్లాలో తెలుగుదేశం పార్టీ దాదాపు ఖాళీ అవుతుందనే ప్రచారం సాగుతోంది. కొత్తగూడెం నియోజకవర్గ శాసన సభ్యుడిగా కోనేరు నాగేశ్వరరావు మూడు విడతలుగా పనిచేయటంతోపాటు రాష్ట్ర మంత్రిగా జిల్లా అభివృద్ధికి శ్రమించారు. ఇటీవల జరిగిన రాజకీయ సమీకరణలో భాగంగా ఆంధ్రాలో సైతం అధికారం కోల్పోవటంతో టీఆర్‌ఎస్‌లో చేరేందుకు ప్రయత్నం చేసినప్పటికీ నియోజక వర్గంలో రాజకీయ పరిస్థితులు ఆశాజనకంగా లేకపోవటంతో బిజేపీ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి, సీఎం రమేష్ వంటి నాయకులు బీజేపీలో చేరటంతో అదే బాటలో కోనేరు చిన్ని పయనించేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. గత నెల కేంద్ర హోంమంత్రి అమిత్‌షా హైద్రాబాద్ పర్యటన సందర్భంగా బీజేపీలో చేరాల్సి ఉన్నప్పటికీ కొంత జాప్యం జరిగింది. ఈనెల 18న జరిగే బీజేపీ పార్టీ కార్యక్రమంలో జిల్లా నుంచి తన క్యాడర్‌తో సహా తెలుగుదేశం పార్టీని వీడి బీజేపీలో చేరేందుకు మంతనాలు జరుపుతున్నారు. నియోజక వర్గం వారీగా నాయకులతో చర్చించి వారందరినీ హైద్రాబాద్‌కు తరలించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. 2014 ఎన్నికల్లో కొత్తగూడెం నియోజక వర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కోనేరు చిన్ని పోటీ చేశారు.
తర్వాత టీఆర్‌ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడంతోపాటు కొత్తగూడెం ప్రజలకు ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ పట్టాలను అందించేందుకు అమరణ నిరాహార దీక్షలు చేపట్టి ప్రభుత్వం ఒత్తిడి పెంచారు.
ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పాటుపడుతూ టీడీపీని బలోపేతం చేసేందుకు ఆయన శ్రమించారు. 2019లో సీటు కోసం తీవ్ర ప్రయత్నం చేసినప్పటికీ సీటు చేజారిపోయింది. మహాకూటమిగా కాంగ్రెస్, తెలుగుదేశం, సీపీఐలు జత కట్టడంతో కొత్తగూడెం నుంచి పోటీకి కాంగ్రెస్ పార్టీ సీటును కేటాయించటంతో వనమా వెంకటేశ్వరరావు ఉమ్మడి అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచారు. వనమా గెలుపు కోసం పనిచేసినప్పటికీ విజయం సాధించిన ఆయన స్వల్పకాలంలోనే అధికార టీఆర్‌ఎస్ పార్టీలో చేరటం, ఆంధ్రాలో టీడీపీ అధికారాన్ని కోల్పోవటంతో తన రాజకీయ భవిష్యత్ కోసం బీజేపీలో చేరికకు సమాలోచనలను జరిపినట్లు తెలుస్తోంది. బీజేపీ అధిష్టాష్ఠానం నుంచి సానుకూల సంకేతాలు అందటం, పార్టీలో సముచిత న్యాయం చేస్తామనే హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.