ఖమ్మం

జూనియర్ లైన్‌మెన్ పోస్టులకు 45మంది హాజరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(గాంధీచౌక్), జూన్ 19: విద్యుత్‌శాఖలో జూనియర్ లైన్‌మెన్ పోస్టులకు దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 19,20,21తేదిలలో పోల్ పరిక్షలు పెట్టనున్న నేపథ్యంలో బుధవారంమైన మొదటి రోజు 45మంది అభ్యర్థులు హజరయ్యారని విద్యుత్‌శాఖ ఖమ్మం ఎస్‌ఇ రమేష్ తెలిపారు. విద్యుత్‌శాఖలో నూతంగా లైన్‌మెన్ పోస్టులను భర్తీ చేసేందుకు సిద్దమైన విద్యుత్‌శాఖ గతంలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు అన్ని టెస్టులు నిర్వహించినప్పటికి చివరి దశలో దానిని రద్దు చేయటం జరిగింది. కాగా తిరిగి వారితో పాటు మరికొంత మందికి అవకాశం ఇవ్వటంతో తిరిగి దరఖాస్తు చేసుకొని పోల్ టెస్ట్‌కు సిద్దమయ్యారు. దీంతో బుధవారం ఖమ్మం నగరంలోని ఎస్‌ఇ కార్యాలయంలో వరంగల్ సిజిఎం కమర్షియల్ అధికారి వేణుగోపాలచారి, ఖమ్మం ఎస్‌ఇ రమేష్‌ల ఆధ్వర్యంలో పోల్ టెస్టులు నిర్వహించారు. ఈ టెస్టుల్లో అభ్యర్థులు తమ పోల్‌ను ఎక్కె ప్రతిభను కనబర్చారు. ఈ టెస్టులు మూడు రోజులు ఉండటంతో మిగిలిన అభ్యర్థులకు కూడా పోల్ టెస్ట్ నిర్వహించిన అనంతరం ఫలితాలను విడుదల చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. మిగిత రెండు రోజుల్లో నిర్వహించనున్న పోల్ టెస్ట్‌కు అభ్యర్థులు సకాలంలో రావటంతో పాటు వారి వెంట వారి సర్ట్ఫికెట్‌లను తప్పనిసరిగా తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిఇటి రామారావు, డిటివో హీరాలాల్, భద్రాచలం డిఇ ప్రతాప్‌రెడ్డి, పివో డేవిడ్‌రాజ్, జెవో శేషు, సిబ్బంది పాల్గొన్నారు.