ఖమ్మం

స్వార్థప్రయోజనాలకోసమే భట్టీపై ఆరోపణలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(మామిళ్ళగూడెం), జూన్ 19: స్వార్థప్రయోజనాలకోసమే సీఎల్పీ నేత భట్టీ విక్రమార్కపై ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్, టీఆర్‌ఎస్ నాయకులు పల్లా రాజేశ్వరరెడ్డిలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ అన్నారు. బుధవారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అభివృద్ధి పేరుతో అవినీతికి పాల్పడుతున్న టీఆర్‌ఎస్ నాయకులు తమ తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవడంకోసం కాంగ్రెస్‌పై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో 20శాతం పనులు మాత్రమే పూర్తిచేసి ప్రారంభించడం ప్రజలను పక్కదారి పట్టించడమే కాక మరొకటికాదన్నారు. పువ్వాడ అజయ్‌కుమార్, రాజేశ్వరరెడ్డి తమ వ్యాపారాల అభివృద్ధికోసం, స్వలాభంకోసం భట్టీపై ఆరోపణలుచేసి ముఖ్యమంత్రి కేసిఆర్ దగ్గర మెప్పుపొందడం కోసమేనన్నారు. జిల్లాలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరావుకు పట్టినగతే టీఆర్‌ఎస్ నాయకులకు పడుతుందని హెచ్చరించారు. తొలుత కాంగ్రెస్ అధినేత రాహుల్‌గాంధీ 49వ జన్మదిన వేడుకలను కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు వీరభద్రం, రామ్మూర్తినాయక్, సరస్వతి, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

డబుల్‌బెడ్రూం ఇండ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలి
* జిల్లా కలెక్టర్ ఆర్‌వి కర్ణన్

ఖమ్మం, జూన్ 19: డబుల్‌బెడ్రూం ఇండ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఆర్‌వి కర్ణన్ సంబందిత శాఖల అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ ప్రజ్ఞా సమావేశ మందిరంలో ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్‌తో కలిసి నిర్మాణాల పనుల పురోగతిపై సమీక్షించారు. ఖమ్మం నియోజకవర్గ పరిధిలో వైయస్సార్ నగర్, టేకులపల్లి, బురహాన్‌పురం, నగర పాలక సంస్థ పరిధిలో చేపడుతున్న పనులను వెంటనే పూర్తిచేయాలన్నారు. నిర్మాణాలకవసరమైన ఇసుకను ఎర్రుపాలెం ఇసుకరీచ్ నుండి తరలించాలని అధికారులను ఆదేశించారు. ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్, గిరిజన సంక్షేమ, సర్వశిక్ష అభియాన్ శాఖల ద్వారా చేపడుతున్న గృహనిర్మాణాలకు ఇసుక కొరత లేకుండా పనులను పూర్తిచేయాలన్నారు. ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ మాట్లాడుతూ ఖమ్మం నియోజకవర్గ పరిధిలో ఇంకనూ 1240 గృహాలు పూర్తికావాల్సి ఉన్నాయన్నారు. వీటి పనులలో అలసత్యం జరుగుతుందని సత్వరమే ఇసుక సరఫరాకు తగు చర్యలు చేపట్టాలన్నారు. నిర్మాణాలు పూర్తి అయిన ఇండ్లకు విద్యుత్ సరఫరా, రోడ్లు, తాగునీరు తదితర సౌకర్యాలు కల్పించాలన్నారు. ఈ సమావేశంలో డీఆర్‌వో శిరీష, పిఆర్ ఎస్‌ఈ సీతారాములు, ఆర్ అండ్ బి ఎస్‌ఈ లింగయ్య, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.