తెలంగాణ

ఉగ్రవాదంపై మెతక వైఖరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెరాస సర్కారుపై కిషన్‌రెడ్డి ధ్వజం

హైదరాబాద్, డిసెంబర్ 28: ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) ఉగ్రవాద మూకలతో సంబంధాలు కొనసాగించే వ్యక్తులు, సంస్థలపై కఠినంగా వ్యవహరించాలని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం ఆయ న పార్టీ కార్యాలయంలో పాత్రికేయులతో మాట్లాడుతూ, ఐసిస్ ఉగ్రవాదులతో సంబంధాలు పెట్టుకుని రక్తపాతానికి పాల్పడుతున్న సంస్థ లు, వ్యక్తుల పట్ల రాష్ట్ర ప్రభు త్వం మెతక వైఖరి అవలంబిస్తోందని, దీని వల్ల భవిష్యత్‌లో తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచాన్ని వణికిస్తున్న ఉగ్రవాదం పట్ల అలసత్వం తగదని, ఐసిస్‌కు తెలంగాణలో సానుభూతి పరులు పుట్టుకురావడం, ఆ సంస్థలో చేరేందుకు చాలా మంది ముందుకు రావడానికి కా రణం ఏమిటో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించాలన్నారు. ఉగ్రవాదులను నిర్వీర్యం చేసేందుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. ఉగ్రవాద ఘటనలు ఎక్కడ జరిగినా దాని మూ లాలు హైదరాబాద్‌లో ఉండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోందన్నారు. హైదరాబాద్‌కు చెందిన యువకులు ఇతర రాష్ట్రాల ద్వారా దేశం విడిచి వెల్లడానికి ప్రయత్నిస్తూ దొరికిపోయినా రాష్ట్రప్రభుత్వం మాత్రం సీరియస్‌గా తీసుకోవడం లేదని విమర్శించారు. హైదరాబాద్‌కు చెందిన పలువురు వ్యక్తులు ఉగ్రవాద సంస్థల్లో శిక్షణ పొందుతున్నారన్న పోలీసుల అభిప్రాయాన్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలని కిషన్‌రెడ్డి చెప్పారు.