తెలంగాణ

అమానుషం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గర్భిణిని కొట్టి చంపిన కిరాతకులు
ఇటుక బట్టీ కూలీపై సూపర్‌వైజర్ల ఘాతుకం
పెద్దపల్లిలో యజమాని ఆదేశాలతోనే ఘోరం
శవాన్ని కదలనీయని వలస కార్మికులు
పెద్దపల్లి/ పెద్దపల్లి రూరల్, డిసెంబర్ 3: కరీంనగర్ జిల్లా పెద్దపల్లి మండలంలోని హన్మంతునిపేట గ్రామంలో ఇటుక బట్టీల్లో అమానవీయ సంఘటన సభ్యసమాజాన్ని నివ్వెరపర్చింది. అనారోగ్యంతో గుడిసెలో ఉన్న కార్మికురాలు ఇటుకల పనికి రానని చెప్పడంతో ఆగ్రహించిన సూపర్‌వైజర్లు నాలుగు నెలల గర్భిణి అని కూడా చూడకుండా కడుపులో తన్నడంతో విలవిల్లాడుతూ ప్రాణాలు కోల్పోయిన వలస కార్మికురాలి విషాద సంఘటన కరీంనగర్ జిల్లా పెద్దపల్లి మండలంలోని హన్మంతునిపేట గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. పెద్దపల్లి శివారులోని శ్యాం అనే యజమానికి చెందిన ఇటుక బట్టిల్లో పనిచేసేందుకు ఒడిశా ప్రాంతం నుండి వలస కార్మికులు వచ్చారు. గత కొనే్నళ్లుగా ఇదే బట్టీల్లో పనిచేస్తున్న కార్మికులుగా నాలుగు వారాల క్రితమే చేరిన సూర్జోబాగ్, జితేంద్రబాగ్ అనే జంట బుధవారం ఇటుకల తయారీకి రాలేదు. గురువారం పనికి రావాల్సిందిగా ఇటుక బట్టీ యజమాని శ్యాం ఆదేశించాడు. అయితే తనకు ఆరోగ్యం బాగాలేదని చెప్పడంతో ఆయన కింద పనిచేస్తున్న సూపర్‌వైజర్లు కహుందాబ్, కహంతాబ్, దరుర్బోబ్ ఆగ్రహంపై భార్య, భర్తలను తీవ్రంగా కొట్టారు. దీంతో తన భార్య గర్భవతి అని కూడా చూడకుండా కర్రలతో, కాళ్లతో కడుపులో తన్నడంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. గురువారం మధ్యాహ్నం జరిగిన ఈసంఘటనతో కార్మికులు ఆగ్రహం చెంది యజమాని ఆదేశాల మేరకే దౌర్జన్యం జరిగిందని పట్టణంలోని కార్మిక శాఖ కార్యాలయం వద్దకు చేరుకొని ధర్నా చేపట్టారు. రాత్రి వరకు ఇటుక బట్టీల వద్దనే శవంతోపాటు కార్మికులు బైఠాయించారు. తహశీల్దార్ అనుమరావు, అసిస్టెంట్ లేబర్ కమిషనర్ నీలిమ ఇటుక బట్టీలను సందర్శించి కార్మికులతో మాట్లాడి సంఘటనపై ఆరాతీశారు.
విషయం తెలుసుకున్న పౌరహక్కుల సంఘం జిల్లా నాయకులు మదన కుమారస్వామి, ఎన్ మల్లారెడ్డి, సుచరిత తదితరులు ఇటుక బట్టీ కార్మికులను కలిసి సంఘటనపై విచారణ చేపట్టారు. యజమానుల దౌర్జన్యాల వలన ఇటుక వలస కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన చెందారు. గతంలో నలుగురు కార్మికులు అనుమానాస్పద స్థితిలో ఇప్పుడు సాక్షాత్తు కార్మికుల ముందు గర్భవతిని చంపేశారన్నారు. జరిగిన హత్యలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈమేరకు పౌరహక్కుల సంఘం నాయకులు జిల్లా ఎస్పీ జోయల్ డేవిస్, కలెక్టర్ నీతూకుమారి ప్రసాద్‌లకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఇటుక బట్టీల్లో వరుసగా మరణాలు సంభవిస్తుండడంతో వలస కార్మికులు ఆందోళన చెందుతున్నారు. తమసాటి కార్మికురాలిని యజమాని ప్రోద్బలంతో తమవాళ్లే చంపేశారని న్యాయం చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఇటుకబట్టీల వద్ద ఆందోళన చేశారు. స్థానిక ఎస్సై జగన్‌మోహన్ శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ట్రాక్టర్లో వేసి తరలిస్తుండగా అడ్డుపడ్డ వలస కార్మికులు తిరిగి శవాన్ని కిందికి దించి ఇటుక బట్టీల వద్దకు తీసుకెళ్లారు. సమాచారం తెలుసుకున్న ఎడ్ల మహేశ్ ఇటుక బట్టీల వద్దకు చేరుకుని కార్మికులను శాంతింపజేసి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు.