జాతీయ వార్తలు

ప్రత్యేక ఆహ్వానితుడిగా వెళ్లను:ఖర్గే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: లోక్‌పాల్ కమిటీ ఎంపిక సమావేశానికి ప్రత్యేక ఆహ్వానితుడిగానైతే తాను వెళ్లనని లోకసభలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నేత ఖర్గే మరోసారి స్పష్టంచేశారు. ప్రత్యేక ఆహ్వానితుడికి ఈ సమావేశంలో ఎలాంటి ప్రాధాన్యత లేదని, అందుకే సమావేశానికి వెళ్లటం లేదని ఖర్గే మరోసారి స్పష్టం చేశారు. సుప్రీం కోర్టు ఒత్తిడి మేరకు ఈ ఎంపిక పక్రియ జరుగుతుందని చెప్పారు. ఎంపిక పారదర్శకంగా జరగాలంటే లోక్‌పాల్ ఎంపిక కమిటీలో అతి పెద్ద పార్టీకి చెందిన వ్యక్తిని సభ్యుడిగా చేర్చే నిబంధన మార్చాలనే ప్రయత్నం ప్రభుత్వం నిర్వహించటం లేదని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. అంతేకాదు తనను ప్రత్యేక ఆహ్వానితుడిగా తనను ఆహ్వానిస్తూ ఉద్దేశ్యపూర్వకంగానే కమిటీ ఎంపిక ప్రక్రియను జాప్యం చేస్తుందని అన్నారు. నరేంద్ర మోదీ సారధ్యంలోని కేంద్ర ప్రభుత్వం విపక్షానికి గొంతు లేకుండా చేస్తుందని అన్నారు. ఇదిలావుండగా లోక్‌పాల్ ఎంపిక కమిటీ సమావేశానికి వెళ్లనని ఖర్గే చెప్పటం ఇది ఏడోసారి.