తెలంగాణ

తెలంగాణకు గుండెకాయ.. హైదరాబాద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణకు హైదరాబాద్ గుండెకాయ అని, దానికోసమే 15 సంవత్సరాల సుదీర్ఘపోరాటం చేశామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు అన్నారు. పరేడ్‌గ్రౌండ్‌లో శనివారం రాత్రి నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజలు విజ్ఞతతో ఓటు వేయాలని, ప్రచారహోరులో పడి కొట్టుకుపోవద్దని ఆయన సూచించారు. తెలంగాణ ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటోందని, ప్రత్యేక రాష్ట్రం వస్తే విద్యుత్‌సహా పలు సమస్యలు ఉంటాయని చెప్పిన వారి మాటలు అవాస్తమని నిరూపించామని ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆ రాష్ట్రంలో చాలాపని ఉందని, అక్కడి సంగతులు చూసుకోవాలని హితవు చెప్పారు. హైదరాబాద్ వదులుకుని ఉంటే 2006లోనే తెలంగాణ వచ్చేదని, చంద్రబాబువంటివారు ఈ నగరాన్ని కేంద్రపాలిత ప్రాంతం చేయాలనుకున్నారని విమర్శించారు. అన్ని కష్టాలను ఎదుర్కొని తెలంగాణ సాధించామని కెసిఆర్ అన్నారు. ఈ సభలో మొదట మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాసయాదవ్‌సహా పలువురు మాట్లాడారు.