జాతీయ వార్తలు
స్వీయ నియంత్రణ పాటిస్తే దేశ సేవ చేసినట్లే:కేసీఆర్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
హైదరాబాద్: రేపు 24 గంటలు జనతా కర్ఫ్యూ పాటిద్దామని తెలంగాణ సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ఇలా చేసి దేశానికి ఆదర్శంగా నిలుద్దామని ఆయన అన్నారు. శనివారంనాడు ప్రగతిభవన్లో మీడియాతో మాట్లాడుతూ ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ప్రభుత్వం ఉందని అన్నారు. స్వీయ నియంత్రణ పాటించినట్లయితే దేశానికి సేవ చేసినట్లేనని అన్నారు. రేపు ఉదయం ఆరు గంటల నుంచి ఎల్లుండి ఉదయం ఆరు గంటల వరకు జనతా కర్ఫ్యూ పాటిద్దామని అన్నారు. బస్సులు, మెట్రోరైళ్లు అన్నీ బంద్ చేస్తున్నట్లు, అలాగే వైన్ షాపులు కూడా బంద్ చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో రేపు అత్యవసర సేవల సిబ్బంది మాత్రమే పనిచేస్తారని అన్నారు. వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్ పాటించాలని పిలుపునిచ్చారు. మహారాష్ట్ర నుంచి వైరస్ వ్యాప్తి ఉండే అవకాశాలు ఉన్నందున మహారాష్ట్ర సరిహద్దులను మూసివేస్తున్నామని తెలిపారు. అవసరమైతే అన్ని సరిహద్దులను కూడా మూసివేస్తామని చెప్పారు. రాష్ట్రంలో అన్నీ షట్డౌన్ చేసి అవసరమైతే ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా అన్ని నిత్యావసర వస్తువులు అందిస్తామని వెల్లడించారు.