కథా సాగరం

ఉస్మాన్ హరూనీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇండియాలో గొప్ప సూఫీ గురువు ఉండేవాడు. ఆయన పేరు ఉస్మాన్ హరూనీ. ఆయనకు వేల మంది శిష్యులు వుండేవాళ్లు. వాళ్లలో ఎందరో విద్యావంతులు, తాత్వికులు వుండేవాళ్లు. ఆయన ఎంతో గాఢంగా వాళ్లకు మార్మిమార్గం గురించి ఉపదేశించేవాడు.
ఆయన దగ్గరున్న వాళ్లందరూ దాదాపు నామ, రూప రహితుడయిన దేవుణ్ణి విశ్వసించేవాళ్లు. నిరాకారుడయిన దేవుణ్ణి ఆరాధించేవాళ్లు.
ఒక సందర్భం వచ్చింది. ఉస్మాన్ హరూనీ తన శిష్యులతో ‘నేను మత సంప్రదాయాన్ననుసరించి దైవాన్ని ఆరాధిస్తున్నాను. ఇప్పుడు నమ్రతగా కాళీమాత ముందు మోకరిల్లి లొంగిపోదామనుకుంటున్నాను’ అన్నాడు.
ఆ మాటల్తో శిష్యులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. అంతవరకూ నామరూప రహితుడయిన భగవంతుణ్ణి ఆరాధించే గురువు భయంకరమయిన మూర్తి మత్వమున్న కాళికాదేవిని పూజించడమా? అది వాళ్ల ఊహకే అందలేదు. గురువు మత నియమాల విధ్వంసానికి పూనుకుంటున్నాడు. ఇది దారుణం. మత వ్యతిరేకం. గురువు పరిధుల్ని, పరిమితుల్ని అతిక్రమిస్తున్నాడని, నిర్హేతుకంగా ప్రవర్తిస్తున్నాడని ఆగ్రహించారు. దారి తప్పాడని భావించారు.
దాదాపు అందరూ గురువుని వదిలి వెళ్లిపోయారు. గురువు కాళీమాత ఆలయానికి బయల్దేరాడు. ఒక శిష్యుడు మాత్రం ఆయన్ని అనుసరించాడు. ఆ యువకుడు గురువు పట్ల ఆరాధనా భావమున్నవాడు. కొంతదూరం నడిచాక గురువు వెనక్కి తిరిగి ‘నువ్వు వెనక్కి వెళ్లు. నాతో రాకు. అందరూ నన్ను వదిలివెళ్లారు. వాళ్లు చేసిన పని సరయిందేమో. నేను చేసేది తప్పేమో’ అన్నాడు. కానీ శిష్యుడు వౌనంగా అనుసరించాడు. గురువు ఆలయాన్ని చేరుకుని అపూర్వమయిన కాళీమాత విగ్రహానికి తలవంచాడు.
శిష్యుడు గురువును చూశాడు. వేల మంది అనుయాయులున్న గురువు ఒంటరిగా మిగలడం పట్ల అతనికి సానుభూతి కలిగింది. గురువు తల ఎత్తి శిష్యుణ్ణి చూసి ‘ఇంకా నువ్వు నన్ను అనుసరిస్తున్నావా?’ అన్నాడు.
శిష్యుడు ‘అవును. మిమ్మల్ని అనుసరిస్తున్నాను’ అన్నాడు. గురువు ‘బహుశా నువ్వు ఎందుకు నన్ను అనుసరిస్తున్నావో నీకు తెలీదనుకుంటాను’ అన్నాడు.
దానికి శిష్యుడు ‘మీరు ఆధ్యాత్మిక మార్గంలో మొదటి పాఠం నాకు బోధించారు. ఉనికిలో వున్నది ఏదీ దైవంతో సరిపోలదు. అట్లాంటప్పుడు కాళీమాత మూర్తిని నేను ఎట్లా కాదంటాను. మీరు ఆ మూర్తికి తలవంచితే నేనూ మిమ్మల్ని అనుసరిస్తాను.’

--సౌభాగ్య 9848157909