కథా సాగరం

చమత్కారం నిండిన సమాధానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక వీరుడు గుర్రం మీద వేటకు బయల్దేరాడు. దారిలో ఒక మనిషి తాగి కనిపించాడు. దారి మధ్యలో కూచున్నాడు. అతను వీరుణ్ణి చూసి ‘నువ్వు నీ గుర్రాన్ని అమ్ముతావా?’ అని అడిగాడు.
వీరుడు అతను తాగి ఉన్నట్లు తెలుసుకుని సమాధానమివ్వలేదు. అడవికి వెళ్లి వేటాడాడు. సాయంత్రమయింది. మళ్లీ తిరుగు ప్రయాణమయ్యాడు. మళ్లీ అదే దారిగుండా గుర్రం మీద వచ్చాడు.
అప్పుడు తాగి దారి మధ్యలో కూచున్న వ్యక్తి ఇప్పుడు దారి

పక్కకు వెళ్లి కూచున్నాడు. మత్తు దిగినట్లుంది.
వీరుడు అతన్ని చూసి గుర్రమాపి నవ్వులాటకు ‘ఇంకా నువ్వు గుర్రాన్ని కొనాలనే ఎదురుచూస్తున్నావా?’ అని అడిగాడు.
మత్తు దిగిపోయిన ఆ మనిషి తను మత్తులో ఉన్నప్పుడు అన్న మాటల్ని గుర్తు తెచ్చుకుని ఎంతో చమత్కారంగా సమాధానమిచ్చాడు. ‘గుర్రాన్ని కొనాలనుకున్నవాడు వెళ్లిపోయాడు. గుర్రం మీద వున్నవాడు మాత్రమే మిగిలాడు’
అతని చమత్కారం నిండిన సమాధానానికి వీరుడు సంతోషించాడు.

- సౌభాగ్య, 9848157909