కథా సాగరం

ఒప్పు-తప్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోసెస్ ప్రవక్త సీనాయ్ పర్వతం దగ్గరకు వెళుతున్నాడు. దారిలో ఆయన ఒక భక్తిపరుడయిన వ్యక్తిని కలిశాడు. ఆ భక్తుడు ‘ఎక్కడికి వెళుతున్నారు?’ అని అడిగాడు. మోసెస్ ‘సీనాయ్ పర్వతం మీదకు’ అన్నాడు. ఆ భక్తుడు ‘దయచేసి నా గురించి దేవుడితో చెప్పు. నేను నా జీవితమంతా దైవభక్తితో, నియమనిష్టల్తో గడిపాను. ధర్మబద్ధంగా జీవించాను. నేను భగవంతుణ్ణి ప్రార్థించాను. కానీ ఏం లాభం? నా బతుకంతా బాధలు, కష్టాలు, దురదృష్టాలే. ఈ సంగతి చెప్పు’ అన్నాడు.
అతని మాటలు విని మోసెస్ అక్కడి నించి ముందుకు కదిలాడు. కాసేపటికి వీధి పక్కన ఒక వ్యక్తి కూచుని మద్యం తాగుతున్నాడు. మోసెస్‌ని చూసి ‘ఎక్కడికి వెళుతున్నారు?’ అన్నాడు. మోసెస్ ‘సీనాయి పర్వతం మీదకు’ అన్నాడు. ఆ వ్యక్తి ‘అయితే దేవుడితో నా గురించి చెప్పండి’ అన్నాడు.
మోసెస్ సీనాయి పర్వతం మీదకు వెళ్లి దేవుడితో మొదట భక్తుడు చెప్పిన విషయాలు గురించి ప్రస్తావించాడు. దేవుడు ‘అతని కోసం స్వర్గంలో స్థానముంది’ అన్నాడు. తరువాత తాగుబోతు గురించి చెప్పాడు. దేవుడు ‘అతను దారుణమయిన నరకానికి వెళతాడు’ అన్నాడు. మోసెస్ పర్వతం దిగి వచ్చి మొదట తాగుబోతు దగ్గరికి వెళ్లాడు.
‘నువ్వు దారుణమయిన నరకానికి వెళతావని దేవుడన్నాడు’ అని చెప్పాడు. దానికి తాగుబోతు ‘ఏమిటి? దేవుడు నా గురించి చెప్పాడా?’ అంటూ పట్టలేని ఆనందంతో గంతులు వేశాడు. నాట్యం చేశాడు. ఆ నిష్కల్మష హృదయమున్న సాధారణ వ్యక్తి దేవుడు తన గురించి అనుకున్నాడన్న మాటతోనే ఆనందించాడు. అప్పుడు ‘సృష్టికర్తకి, సమస్త విశ్వ సామ్రాజ్య చక్రవర్తికి, ఈ సాధారణ, అనామక వ్యక్తి గురించి తెలుసు. ఈ పాపి గురించి ఆయనకు తెలుసు. అంతకంటే నాకింకేం కావాలి?’ అన్నాడు.
మోసెస్ అక్కడి నించి భక్తుడి దగ్గరకు వెళ్లి ‘దేవుడు నీకు స్వర్గంలో చోటుందన్నాడు’ అని చెప్పాడు.
భక్తుడు ‘ఎందుకుండదు? నా జీవితమంతా భక్తిలోనే, భగవంతుని సేవలోనే గడిపాను. బతుకే త్యాగం చేశాను. దాని ఫలితమిది’ అన్నాడు. తాగుబోతు, భక్తుడు ఇద్దరూ చనిపోయారు.
వాళ్ల విషయమేమయిందో తెలుసుకోడానికి సీనాయి పర్వతమెక్కి దేవుణ్ణి అడిగాడు మోసెస్. దేవుడు ‘్భక్తుడు నరకానికి, తాగుబోతు స్వర్గానికి వెళ్లా’రని చెప్పాడు. మోసెస్ ‘్భగవంతుడు మాట తప్పాడా?’ అనుకున్నాడు.
దేవుడు ‘మనం తాగుబోతు గురించి మాట్లాడుకున్నామని తెలిసిన క్షణమే అతను ఆనందంతో గంతులేసినపుడే అతని పాపాలు కొట్టుకుపోయాయి. భక్తుడి ధర్మం పనికిమాలింది. మనం కాంతి కోసం సూర్యుణ్ణి పంపినపుడు, వర్షం కోసం మేఘాల్ని పంపినపుడు అతను సంతృప్తి పడలేదు’ అన్నాడు.

- సౌభాగ్య, 9848157909