ఈ వారం కథ

మేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆలయ పై అంతస్థుపై తన తాతయ్య అపార్ట్‌మెంట్ కి వెళ్లింది. డోర్‌బెల్ విని తలుపు తెరచిన తాతయ్య అడిగాడు
‘ఉత్త చేతలతో రావుకదా? ఇవాళేం తెచ్చావు?’
అరిటాకులో చుట్టిన ఓ పార్సెల్ ని టీపాయ్ మీద ఉంచి ఆలయ చెప్పింది.
‘‘నేను త్వరగా వెళ్లాలి’’
‘‘ఎందుకు అంత తొందర?’’
‘‘నేను గీత క్లాస్‌లో అప్పచెప్పాల్సిన శ్లోకాలు నేర్చుకోవడంలో వెనకపడ్డాను. అమ్మ నాకు వాటిని నేర్పిస్తానంది తాతయ్య! నువ్వు అన్ని శ్లోకాలని ఎలా గుర్తుపెట్టుకోగలవు? ’’ఆలయ అడిగింది.
‘‘నీకు నీ టేబ్లెట్ పాస్‌వర్డ్ తెలుసా?’ నీ ఇంటి చిరునామా ? అవి గుర్తుంచుకోవడం కష్టం కాదా?’’
‘‘కాదు. చాలా తేలిక. ఎందుకంటే నేను రోజూ వాటిని ఉపయోగిస్తున్నాను.’’
‘‘అలాగా? అంటే మనం నిత్యం ఉపయోగించేవే మనం గుర్తుంచుకుంటాం. అవునా?’’
‘‘అవును’’
గట్టిగా వాసన చూసి తాతయ్య చెప్పాడు.‘‘ఘూమాయిస్తోంది’’
‘‘మినపరొట్టె. అమ్మ నీకు ఇష్టమని చేసింది’’
‘‘వెరీగుడ్. ఇది ఇకక్కడ ఉంటే బావుంటుంది కదా.’’ దాన్ని షోకేస్‌లో పెట్టి అడిగాడు.
‘‘నువ్వు దాన్ని అక్కడే ఉంచుతావా?’’ ఆలయ ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది.
‘‘ఇంకేం చేయను?’’
‘‘తిను. అక్కడే ఉంటే దాని వల్ల నీకేం ఉపయోగం ఉండదు’’
‘‘ఒప్పుకుంటాను. మినపరొట్టె షోకేసులో ఉంచితే మనకి దాని వల్ల ఉపోయోగం ఉండదు. అలాగే భగవద్గీతని కూడా బుక్ షెల్ఫ్‌లో ఉంచితే దాని వల్ల మనకేం ఉపయోగం ఉండదు. మినపరొట్టె తింటే దాన్నించి శక్తి వచ్చినట్లే నువ్వు నిత్యం గీతాశ్లోకాలని తింటూంటే..’’
‘‘తింటూంటేనా?’’
‘‘దాన్ని చదివి జీవితంలో పాటిస్తేనే దాని శక్తి నీకు లభిస్తుంది. కాబట్టి వాటిని కంఠస్థం చేయడమే కాక, రోజూ వాటిని పాటిస్తూంటే గుర్తుంచుకోవడం తేలిక.’’
‘‘అలాగే తాతయ్య! ఇక నించి నా ఎదుగుదలకి గీతాశ్లోకాలని తింటూంటాను.’’ఆలయ నవ్వుతూ చెప్పింది.
‘‘మంచిది. నేను ఇప్పుడు మినపరొట్టె తిని ఎదుగుతాను- పొట్టదగ్గర’’ తాతయ్య తన పొట్టని తడుముకుని నవ్వుతూ చెప్పాడు.
ఆలయ కూడా ఫక్కున నవ్వింది. *