క్రైమ్ కథ

చిన్ని తేడా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక సూఫీ గురువు దగ్గర కొత్తగా ఇద్దరు శిష్యులు చేరారు. సూఫీ గురువు ఇంటి చుట్టూ తోట ఉంది. ఒకరోజు ఇద్దరు శిష్యులూ ఆ తోటలో తిరుగుతున్నారు. నడవడం కూడా ధ్యానంలో భాగమే.
తోటలో పళ్ల చెట్లు, పూల తీగెలు, పక్షుల కిలకిలలు ఎంతో మనోహరంగా ఉంది. ఇద్దరు శిష్యులు పొగ తాగేవాళ్లు. కానీ శిష్యులుగా చేరిన తరువాత పొగ తాగవచ్చా తాగకూడదా అన్న సందేహంలో పడ్డారు. గురువుగారి ఎదుట అయితే పొగ తాగకూడదు. మరి తోటలో తాగితే అభ్యంతరం ఏముంటుంది? అన్న ఆలోచన వచ్చింది.
మొదటి శిష్యుడు ‘ఈ వాతావరణంలో హాయిగా పొగ పీల్చాలనిపిస్తోంది కదూ!’ అన్నాడు. రెండో శిష్యుడు ‘అవును’ అన్నాడు.
‘మరి పొగ తాగడం గురించి గురువును అడుగుదామా?’ అన్నాడు.
రెండో శిష్యుడు ‘అడుగుదాం. దాందేముంది? ఆయన తాగమంటే తాగుదాం, మానేయమంటే మానేద్దాం’ అన్నాడు.
ఇద్దరు గురువుగారి అనుమతి కోరాలని నిర్ణయించారు.
మరుసటి రోజు మొదటి శిష్యుడు చిరాకుగా తోటలోకి వచ్చాడు. రెండో శిష్యుడు తృప్తిగా పొగ పీలుస్తున్నాడు.
మొదటి శిష్యుడు ‘ఎందుకు పొగ పీలుస్తున్నావు?’ అని అడిగాడు.
రెండో శిష్యుడు ‘గురువు నాకు అనుమతి నిచ్చాడు’ అన్నాడు.
మొదటి శిష్యుడు ‘మరి నాకు అనుమతి అడిగితే తిరస్కరించాడు. నీకు అనుమతినిచ్చి నాకు ఇవ్వకపోవడం దారుణం. వెంటనే వెళ్లి ఆ సంగతి గురువుగార్నే అడుగుతాను’ అన్నాడు.
మొదటి శిష్యుడు వెళ్లబోతుంటే రెండో శిష్యుడు పొగ వదుల్తూ ‘ఆగు! తొందరపడవద్దు. నువ్వు ఏమని అడిగావు?’ అన్నాడు.
మొదటి శిష్యుడు ‘గురువుగారూ! మేము తోటలో తిరుగుతాం. నడవడం కూడా ధ్యానంలో భాగమని మీరన్నారు కదా! అయితే ధ్యానం చేసేటప్పుడు పొగ తాగవచ్చా?’ అని అడిగితే గురువుగారు ‘తాగకూడదు’ అన్నారు’ అన్నాడు.
రెండో శిష్యుడు ‘అక్కడే పొరపాటు చేశావు. నేను పొగ తాగేటప్పుడు ధ్యానం చేయవచ్చా?’ అని అడిగాను. గురువుగారు ‘చేయవచ్చు’ అన్నారు. అక్కడే చిన్న తేడా అడగడంలో వచ్చిన తేడా వల్ల నీకు అనుమతి దొరకలేదు’ అన్నాడు.
మొదటి శిష్యుడు నోరెళ్లబెట్టాడు.

- సౌభాగ్య, 9848157909