జాతీయ వార్తలు

కశ్మీర్‌లో పర్యాటకులపై ఆంక్షలు ఎత్తివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మూకశ్మీర్: జమ్మూకశ్మీర్‌లో పర్యాటకులపై ఆంక్షలు ఎత్తివేశారు. ఆర్టికల్ 370 రద్దు తరువాత పర్యాటకులపై నిషేధం విధించారు. దాదాపు రెండు నెలల నుంచి పర్యాటకులు వెళ్లటం లేదు. పర్యాటకులను సైతం అక్కడ ఉండనీయకుండా పంపించివేశారు. ఆగస్టు నెలలో ట్రావెల్ అడ్వయిజరీ సైతం అమలులోకి వచ్చింది. అయితే పర్యాటకులపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అలాగే ట్రావెల్ అడ్వయిజరీని సైతం ఎత్తివేయాల్సిందిగా గవర్నర్ కోరటం జరిగింది జమ్మూకశ్మీర్‌కు ప్రధాన ఆర్థిక వనరు పర్యాటకం. పర్యాటక రంగంలో వచ్చే ఆదాయం గత రెండు నెలలుగా కోల్పోవలసి వచ్చింది.అంతేకాదు ఉగ్రదాడుల నేపథ్యంలోనూ గత కొంత కాలం పాటు ఇక్కడ ఫోన్, ఇంటర్నెట్ సదుపాయాలను సైతం నిలిపివేసిన విషయం విదితమే. యాత్రికులపై నిషేధం ఉన్న కారణంగా పర్యాటకం దెబ్బతిన్నది. గత జూన్‌లో దాదాపు 1.74 మంది పర్యాటకులు వచ్చారు. జూలైలో 1.52 లక్షల మంది వచ్చారు.