జాతీయ వార్తలు
కనిక కపూర్‌పై కేసు నమోదు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 21 March 2020
న్యూఢిల్లీ: కరోనా వ్యాధి వ్యాప్తి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిందంటూ బాలీవుడ్ గాయని కనిక కపూర్‌పై కేసు నమోదు అయింది. విదేశాల నుంచి తిరిగివచ్చిన కనిక కపూర్ కోవిడ్-19 విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని, విదేశాల నుంచి వచ్చిన తరువాత తన సన్నిహితులకు పార్టీని ఏర్పాటు చేశారని, కొన్ని సమావేశాలకు హాజరయ్యారని, ఇలా కోవిడ్-19 పట్ల నిర్లక్ష్యంగా వ్వవహరించారని లక్నో చీఫ్ మెడికల్ ఆఫీసర్ చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సరోజనీ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే ఆమెపై హజ్రత్నగర్, గోమతిపూర్లలో కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.