రాష్ట్రీయం

‘గ్రేటర్’లో యథేచ్ఛగా నకిలీ దందా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కల్తీ నెయ్యి, నూనెలతోపాటు శనగపిండి తయారు తాజా దాడుల్లో ఇద్దరి అరెస్టు
హైదరాబాద్‌లో కల్తీ వ్యాపారం చాలా తేలిక విచారణలో బయటపెట్టిన కల్తీ వ్యాపారులు

హైదరాబాద్, డిసెంబర్ 17: గ్రేటర్ హైదరాబాద్ నగర శివారులో నకిలీ దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. నగరంలోని పహాడిషరీఫ్, బండ్లగూడ, బాలాపూర్, మీర్‌పేట్, హయత్‌నగర్ పరిసర ప్రాంతాల్లో కల్తీవ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయల్లా సాగుతోంది. ప్రముఖ కంపెనీ బ్రాండ్‌ల పేరుతో ఒరిజినల్ ప్యాక్‌లతో ఆకర్షిస్తూ ఎంఆర్‌పి ధరల కంటే పది నుంచి ఇరవై శాతం తక్కువ ధరలకు విక్రయిస్తుండటంతో అమాయక ప్రజలు కొనుగోళ్లు చేస్తున్నారు. పశువుల కళేబరాలతో నెయ్యి, నూనె తయారు చేస్తున్నారు.
మొక్కజొన్న, పెసర్లు, నాసిరకం పప్పు్ధన్యాలతో శనగపిండి తయారు చేస్తున్నారు.గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్న కల్తీ వ్యాపారంపై పోలీసులు దాడులు నిర్వహిస్తున్నా నకిలీ ఉత్పత్తులు మాత్రం ఆగడం లేదు. కల్తీ శనగ పిండి తయారీ ముఠా నాయకుడు రాజేష్‌గుప్తా మరో ఇద్దరు భాగస్వాములను బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. వీరిని విచారించిన నేపథ్యంలో ఎన్నో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. నగర శివారులో జరుగుతున్న కల్తీ వ్యాపారం పొరుగు రాష్ట్రాలకు చెందిన బడా వ్యాపారుల కనుసన్నల్లో జరుగుతుందని, ఇక్కడి ప్రాంతాల్లో కాందీశికులు అధికంగా ఉండడంతో పోలీసులు, ఫుడ్ ఇన్‌స్పెక్టర్ల నిఘా కొరవడిందని, దీంతో కల్తీ వ్యాపారానికి ఇక్కడి ప్రాంతం సులువైందని వ్యాపారులు చెబుతున్నారు.
తాము తయారు చేసే కల్తీ నెయ్యి, నూనె, పిండి వంటి వాటిని మార్కెట్లో అసలు ధరల కంటే 50 శాతం తక్కువ ధరలకు విక్రయిస్తున్నట్టు నకిలీ వ్యాపారులు చెబుతున్నారు. నకిలీ ఉత్పత్తులకు కేంద్రంగా ఎంచుకున్న హైదరాబాద్‌కు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాలకు చెందిన వారే ఎక్కువగా ఉన్నారని, వీరే ఇక్కడి ప్రాంతాల్లో కల్తీ వ్యాపారం నిర్వహిస్తున్నట్టు పోలీసులు కనుగొన్నారు.
బెయిలబుల్ కేసులు కావడంతోనే..
నకిలీ ఉత్పత్తుల స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహిస్తూ వ్యాపారులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నారు. కానీ వీరు బెయిల్‌పై విడుదలై మళ్లీ అదే వ్యాపారాన్ని నిర్వహించడం, లేదా వారి రాష్ట్రాలకు వెళ్లడం, ఇతర రాష్ట్రాల్లో కల్తీ వ్యాపారానే్న సాగించడం జరుగుతోంది. చట్టాల్లోని లొసుగులను ఆసరా చేసుకొని కల్తీ వ్యాపారాన్ని సాగిస్తున్నారని ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు చెబుతున్నారు. అక్రమ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకొని, నాన్‌బెయిలేబుల్ కేసులు నమోదు చేస్తే కల్తీకి అడ్డుకట్ట వేయవచ్చని అధికారులు అంటున్నారు. ఆ దిశగా అధికారులు కల్తీపై ఉక్కుపాదం మోపితే గానీ అక్రమ వ్యాపారాలకు అడ్డుకట్ట పడదని అధికారులు పేర్కొంటున్నారు.
నెలలో పది కేసులు నమోదు: 35మంది అరెస్టు
నగర శివారులోని అక్రమ వ్యాపారాలపై పోలీసులు దృష్టి సారించి కల్తీ నూనె, నెయ్యి, పచ్చళ్లు, శనగపిండి తయారు చేస్తున్న స్థావరాలు టాస్క్ఫోర్సు అధికారులు దాడులు నిర్వహించారు. అక్టోబర్ 28వ తేదీ నుంచి డిసెంబర్ 16వరకు పదికేసులు నమోదయ్యాయి. 35మందిని అరెస్టు చేసి వారినుంచి దాదాపు రెండుకోట్లు విలువ చేసే కల్తీ ఉత్పత్తులు, సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. మరో 15మంది పరారీలో ఉన్నట్టు టాస్క్ఫోర్సు అధికారులు పేర్కొన్నారు.