రాష్ట్రీయం

ఉనికిలేని పార్టీకి ఉత్తరకుమారుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రఘువీరాపై ధ్వజమెత్తిన * ఏపి టిడిపి చీఫ్ కిమిడి కళావెంకటరావు
శ్రీకాకుళం, డిసెంబర్ 6: టిడిపి చేపట్టిన జన చైతన్య యాత్రలు ఉనికి కోసమే అంటూ ఎపిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి చేసిన వ్యాఖ్యలు అసలు ఉనికే లేని కాంగ్రెస్ పార్టీకి ఉత్తరకుమారుడిని గుర్తు చేస్తున్నాయని ఎపిటిడిపి అధ్యక్షుడు కిమిడి కళా వెంకటరావు విమర్శించారు. లోటుబడ్జెట్‌లో గల రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించేందుకు ముఖ్యమంత్రి మరిన్ని పథకాలు ప్రారంభించేలా జనచైతన్య యాత్రలకు శ్రీకారం చుట్టారన్నారు. రాష్ట్రాన్ని అంధకారంలోకి కాంగ్రెస్ నెట్టేసిందని, అందువల్ల గత ఎన్నికల్లో ఉనికి కోల్పోయిందని, ఇటువంటి పార్టీకి ఉత్తరకుమారుడి సారధ్యం వహిస్తున్న రఘువీరారెడ్డి టిడిపిని విమర్శించడానికి అర్హుడు కాదన్నారు. ఆదివారం జిల్లాలోని తమ్మినాయుడుపేటలో నిర్వహించిన జనచైతన్యయాత్రలో పాల్గొన్న ఆయన విలేఖరులతో మాట్లాడారు. హేతుబద్దంగా రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ నేతలకు చంద్రబాబునాయుడును విమర్శించే హక్కు లేదన్నారు. జనచైతన్య యాత్రలతో ప్రజల సమస్యలను తెలుసుకుని మరిన్ని కొత్త పథకాలు ప్రారంభించేలా ఈ కార్యక్రమాన్ని తిరుపతి వేదికగా బాబు రూపకల్పన చేశారన్నారు. జనవరి 1 నుంచి నిర్వహించనున్న జన్మభూమిలో అర్హులందరికీ రేషన్ కార్డులు పంపిణీ చేస్తామన్నారు. సంక్షేమం - అభివృద్ధి అనే అజెండాతో ఈ యాత్రలు మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు గ్రామాల్లో సాగిస్తున్నారని చెప్పారు.
రాష్టవ్య్రాప్తంగా రోజుకు 1100 గ్రామాల్లో ఈ యాత్రలను నిర్వహించి, ఈ సందర్భంగా స్వీకరించే ప్రజాసమస్యలను సైతం కేంద్రపార్టీ కార్యాలయంలో ఆన్‌లైన్ ప్రక్రియ ద్వారా నమోదు చేసే బాధ్యతను పార్టీ జనరల్ సెక్రటరీ లోకేష్ నిర్వహిస్తున్నారన్నారు. బిజెపి నేతలతో ఇప్పటికే చర్చలు జరిపామని, అభిప్రాయబేధాలు తలెత్తకుండా సమన్వయంతో ఆ కేడర్‌కు ప్రభుత్వ కార్యక్రమాల్లో కీలక బాధ్యతలు అప్పగిస్తామని చెప్పారు.