జాతీయ వార్తలు

ఇది కక్షసాధింపే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాంగ్రెస్‌ను నామరూపాలు లేకుండా చేయాలన్నది మోదీ కల
ప్రధానికి దాసోహమనే ప్రసక్తే లేదు న్యాయం మా పక్షానే ఉంది
నిప్పులు చెరిగిన సోనియా కేంద్రం మూల్యం చెల్లించక తప్పదు: రాహుల్

న్యూఢిల్లీ, డిసెంబర్ 19: నేషనల్ హెరాల్డ్ వివాదంలో న్యాయస్థానం ముందు వ్యక్తిగతంగా హాజరై బెయిల్ పొందిన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కోర్టు నుంచి తన నివాస గృహమైన 10 జన్‌పథ్‌కు చేరుకున్న సోనియా పార్టీ నాయకులతో సమాలోచనలు జరిపారు. పార్టీ ప్రధాన కార్యాలయానికి వచ్చి రాహుల్ గాంధీతో కలిసి విలేఖరులతో మాట్లాడారు. మోదీ ప్రభుత్వం బుద్ధిపూర్వకంగా రాజకీయ ప్రత్యర్ధులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని సోనియా ఆరోపించారు.
తన లక్ష్య సాధన కోసం ప్రభుత్వ సంస్థలను దురుపయోగం చేస్తోందన్నారు. తమ కుటుంబంపై కక్ష తీర్చుకోవటానికి మోదీ ప్రభుత్వం నిరాధారమైన కేసులతో న్యాయ స్థానాన్ని ఆశ్రయిస్తోందన్నారు. న్యాయ స్థానాలపై తనకు అపారమైన నమ్మకం, గౌరవం ఉన్నాయని చెబుతూ తామెట్టి తప్పు చేయలేదని చెప్పారు. చట్టాన్ని గౌరవించే బాధ్యతాయుతమైన పౌరులుగా తాము కోర్టుకు హాజరయ్యామన్నారు. మోదీ హయాంలో సమాన న్యాయం లభించే అవకాశాలు లేవని సోనియా అభిప్రాయపడ్డారు. తమ పార్టీని నామరూపాలు లేకుండా చేయాలన్న మోదీ ఆలోచనలు కలగా మిగిలిపోతాయన్నారు. ప్రభుత్వం ఒత్తిడులు తెచ్చినంతమాత్రాన భయపడిపోయి దాసోహం అనే ప్రసక్తి లేదని సోనియా ప్రకటించారు.
న్యాయం తమ పక్షానే్న ఉందనీ నిజానిజాలు అన్నీ బయట పడతాయని ఆమె చెప్పారు. తమ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా బడుగు బలహీన వర్గాల ఆభ్యున్నతికే తాము కట్టుబడి ఉంటామని సోనియాగాంధీ ప్రకటించారు.
పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం తమపై ప్రతీకారం తీర్చుకోవటానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. మోదీ ఒత్తిడికి తాను లేదా తమ పార్టీ తలదించే ప్రసక్తి లేదని ఆయన చెప్పారు. చట్టాన్ని తాను గౌరవిస్తానని ఆయన చెప్పారు. మోదీ ప్రభుత్వం పాల్పడుతున్న కక్ష సాధింపుచర్యలకు తగిన మూల్యం చెల్లించి తీరుతుందని ఆయన అభిప్రాయ పడ్డారు. మాజీ ప్రధాని మన్‌మోహన్ సింగ్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో కక్ష సాధింపుచర్యలకు స్ధానం లేదని చెప్పారు. మోదీ ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం రాజకీయ ప్రత్యర్ధులను ఏరివేసే లక్ష్యంతో వ్యవహరిస్తోందని ఆయన చెప్పారు.