రాష్ట్రీయం

ఎంతకాలం మీ డ్రామాలు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్ర ప్రభుత్వంపై జెపి విసుర్లు
విజయవాడ, డిసెంబర్ 19: సాధారణ, మధ్యతరగతి ప్రజలు తమ కాళ్లపై తాము నిలబడేలా కనీసం విద్య, వైద్య సదుపాయాలపై దృష్టి సారించకుండా ఏదో రాబోతోంది, ఏదో జరగబోతోందని మభ్యపెడుతూ రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ డ్రామాలు, మ్యాజిక్‌లతో ఇంకా ఎంతకాలం మోసగిస్తుందని లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ ఎన్ జయప్రకాష్ నారాయణ్ ధ్వజమెత్తారు. శనివారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ కాల్‌మనీ, వడ్డీ వ్యాపారాలపై పాలకపక్షం, అధికారపక్షం మాట్లాడుతున్న తీరు ఆశ్చర్యం గొలుపుతోందన్నారు. రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులే వారిని ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. ఒక ఎమ్మెల్యే, ఒక మంత్రి ఒక వీధికి వస్తే కార్యకర్తలు, నేతలు వేలకు వేలు ఖర్చుచేస్తూ ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు పెడుతున్నారంటే వారి అండదండలతో అక్రమంగా సంపాదించుకోటానికే కదా అని అన్నారు. వాస్తవానికి ధర్మవడ్డీ, సాధారణ, బారువడ్డీలతో వ్యాపారాలు ఊరూవాడా జరుగుతూనే వుంటాయని, అయితే ఇటీవల అతితక్కువ కాలంలో లక్షకు లక్షలు సంపాదించేందుకు కాల్‌మనీ వ్యాపారం సాగిస్తున్నారన్నారు. వీరికి అధికారపక్షం, ముఖ్యంగా పోలీసుల అండదండలు ఉండబట్టే తాజాగా మరో అడుగు ముందుకేసి సెక్స్‌రాకెట్ నడుపుతున్నారన్నారు.
ఒక సాధారణ కుటుంబమంతా కాయకష్టం చేసుకుంటూ నెలకు రూ.10వేలు సంపాదిస్తుంటే దురదృష్టవశాత్తూ వారిలో ఎవరైనా వ్యాధి బారినపడి ఏదైనా శస్తచ్రికిత్స చేయించుకోవాల్సివస్తే వడ్డీపై అప్పుచేయాల్సి వచ్చినా సకాలంలో తీర్చలేక అప్పుల ఊబిలో చిక్కి శల్యమవుతున్నారని అన్నారు. ఇలాంటి దైన్యస్థితిలో ప్రభుత్వపరంగా ఆదుకునే వ్యవస్థ అంటూ లేకపోవటమే దీనికి కారణమన్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఇటీవల తాను విస్తృతంగా పర్యటించానని, ప్రభుత్వపరంగా ఏ గ్రామంలోనూ ఉపాధి అవకాశాలు కన్పించలేదన్నారు. ఎవరిని కదిలించినా ఫైనాన్స్ లేదా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నామని చెబుతుంటే ఆశ్చర్యపోయానని చెప్పారు. ఈ రెండు వ్యాపారాలు ఎంత బాగా సాగుతుంటే సామాన్యులు అంతటి అథమ స్థితిలోకి వెళుతున్నారనేది మనం గుర్తించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఇవేమీ పట్టవని, కొంతకాలం హుదూద్ తుఫాన్, గోదావరి పుష్కరాలు, పట్టిసీమ, రాజధాని శంకుస్థాపన, త్వరలో కృష్ణా పుష్కరాల పేరిట మేజిక్ చూపుతోందని ఆయన మండిపడ్డారు.