సబ్ ఫీచర్

పాత్రికేయులకు కొరవడుతున్న భద్రత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా జర్నలిస్టులను నిర్బంధించడం ద్వారా చైనా రికార్డ్ నెలకొల్పింది. నాటకీయంగా 2015లో టర్కీ, ఈజిప్ట్‌లలో సహితం పెద్దసంఖ్యలో జర్నలిస్టులను జైళ్ళలో ఉంచారు. అయితే ప్రపంచం మొత్తంమీద జైళ్ళలో ఉన్న జర్నలిస్టుల సంఖ్య మూడేళ్ళలో గత సంవత్సరం కొంతమేర తగ్గింది. న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్న కమిట్ టు ప్రొటెక్ట్ జర్నలిస్ట్స్ (సిపిజె) విడుదల చేసిన నివేదిక ప్రకారం 2015లో 199 మంది జర్నలిస్టులు తమ వృత్తిరీత్యా అరెస్ట్‌అయి జైళ్ళలో ఉన్నారు. సంవత్సరం క్రితం జైళ్ళలో ఉన్నవారి సంఖ్య 221. ఇరాన్, వియత్నాం, ఇథియోపియాలలో జైళ్ళలో ఉన్న జర్నలిస్టుల సంఖ్య తక్కువగా ఉన్నా, ఆయా దేశాలలో వారికి భయానక వాతావరణం నెలకొంది. విడుదలైన చాలామంది కఠిన ఆంక్ష లు, న్యాయపరమైన ఆరోపణలు, బలవంతపు ప్ర వాసం వంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ప్రపంచంలో ఇప్పుడు అత్యధికంగా జర్నలిస్టులు చైనా తర్వాత ఈజిప్ట్‌లో ఉన్నారు. బహుశా ఇటీవల కాలంలో జర్నలిస్టులకు ఈ దేశంలో వలే మరెక్కడా పరిస్థితులు అధ్వాన్నంగా మారలేదు. అసమ్మతిని అణచడంకోసం దేశ అధ్యక్షుడు అబ్దెల్ ఫతా ఎల్ శిశి జాతీయ భద్రతను సాకుగా చూపుతున్నారు. దేశ రాజధాని కైరోలో సంవత్సరం క్రితం 12 మంది జర్నలిస్టులు మాత్రమే జైళ్ళలో ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య 23కు పెరిగింది. 2012లో ఆ దేశంలో ఒక జర్నలిస్టు కూడా జైలులో లేరు. టర్కీలో సహితం జర్నలిస్టులకు పరిస్థితులు దిగజారుతున్నాయి. జైలులో ఉన్నవారి సంఖ్య రెట్టింపై 14కు చేరుకుంది. రెండు సంవత్సరాలపాటు వరుసగా ప్రపంచంలో జర్నలిస్టులకు అధ్వాన్నపు దేశంగా పేరొందినా, అనంతరం 2014లో డజన్ల మందిని విడుదల చేశారు. అయితే రెండు సాధారణ ఎన్నికలు, సిరియాలో పౌర యుద్ధం, నిషేధించిన కుర్దిస్థాన్ వర్కర్స్ పార్టీలో కాల్పుల విరమణ ముగియడంతో తాజాగా అరెస్ట్‌లు జరిగాయి. ప్రపంచంలో జైళ్ళలో ఉన్న జర్నలిస్టులలో నాల్గవ వంతు మంది చైనాలో ఉన్నారు. ప్రస్తుతం అధికారికంగా 49 మంది జైళ్ళలో ఉన్నారు. అధ్యక్షుడు జిన్‌పింగ్ అవినీతిపై దాడులు చేస్తుండటం, దేశ ఆర్థిక ప్రగతి మందగించడం, మార్కెట్లు డీలాపడుతూ ఉండటంతో ఆర్థిక అంశాలపై కథనాలు వ్రాయడం ప్రభుత్వానికి నచ్చడం లేదు. ఇతరులతో కుమ్మక్కయి దేశపు సెక్యూరిటిస్, ఫ్యూచర్ ట్రేడింగ్‌పై తప్పుడు సమాచారం వ్యాప్తిచేస్తున్నారన్న ఆరోపణపై ఆగస్ట్ 25న ఒక బిజినెస్ పత్రిక రిపోర్టర్ వాంగ్ క్రియాలును అరెస్ట్‌చేశారు. ఆ తర్వాత తన కథనం పట్ల ప్రభుత్వ టెలివిజన్‌లో విచారం ప్రకటిస్తూ అతను కనిపించాడు. విమర్శలను అణచివేయడానికి చైనా ప్రభుత్వం ఎంత క్రూరంగా అణచివేస్తుందో చెప్పడానికి ఈ ఉదాహరణ చాలు. దేశంలో తన జాతీయులను ప్రభు త్వం అణచివేస్తున్నదని అమెరికాలో వాషింగ్టన్ కేంద్రంగా పనిచేస్తున్న ఒక చైనాకు చెందిన జర్నలిస్టు అమెరికా నిధులతో పనిచేస్తున్న రేడియోకు కథనం అందజేశారు. అందుకు శిక్షగా చైనాలోని అతని ముగ్గురు సోదరులను అరెస్ట్‌చేసి జైలులో ఉంచారు.
ఇరాన్‌లో జైలులో ఉన్న జర్నలిస్టుల సంఖ్య గత సంవత్సరం 19గా ఉండగా ఇప్పుడు 30కు పెరిగింది. ‘ప్రభుత్వ వ్యతిరేకత’ ఆరోపణలతో వీరిని అరెస్ట్ చేశారు. వాషింగ్టన్ పోస్ట్ జర్నలిస్టును రహస్య సమాచారం పంపుతున్న ఆరోపణపై అరెస్ట్‌చేసి, శిక్ష విధించినట్లు ప్రభుత్వ టి.వి. ప్రకటించింది. అయితే ఎంత కాలం శిక్ష విధించారు, నిర్దుష్ట ఆరోపణలు ఏమిటి, ఏ జైలులో ఉన్నారో వివరాలు తెలుపలేదు. వియత్నాంలో కూడా జైలులో ఉంటున్న జర్నలిస్టుల సంఖ్య పెరుగుతున్నది. అయితే దేశం విడిచి వెళ్ళే హామీతో విడుదల చేస్తుంటారు. ప్రపంచంలో అత్యధికంగా సెన్సార్ చేసే దేశంగా వియత్నాం పేరొందింది. అత్యధికంగా సెన్సార్ చేసే పది దేశాలలో ఇథియోపియా ఒకటి. ఈ సంవత్సరం ఆరుగురు బ్లాగర్‌లను విడుదల చేసినా వారి కదలికలపై కఠిన ఆంక్షలు విధించారు. ప్రముఖ ఆన్‌లైన్ కాలమిస్ట్ ఇస్నిందర్‌నెగా ఇప్పుడు 18 సంవత్సరాల జైలుశిక్షను అనుభవిస్తున్నారు. జైళ్ళలో ఉన్న జర్నలిస్టులలో 55 శాతం మందిపై ప్రభుత్వ వ్యతిరేక ప్రచారానికి పాల్పడ్డారనే ఆరోపణలు మోపారు. మాదక ద్రవ్యాలు, ఆయుధాలు కలిగి ఉండటం, దాడులు చేయడం, అవమానపరచడం వంటి ఆరోపణలు 25 శాతం మందిపై ఉన్నాయి. 2015లో ప్రపంచవ్యాప్తంగా 28 దేశాల్లో జర్నలిస్టులు జైళ్ళలో ఉండగా, 10 దేశాలలో మాత్రం ఒకొక్కరు మాత్రమే ఉన్నారు.
సి.పి.జె. వార్షిక నివేదికలను పొందుపరచి విడుదల చేయడం ప్రారంభించిన 1990 తర్వాత 2015లో అమెరికా జైళ్లలో జర్నలిస్టులు లేనట్లు నమోదైంది. ఈవిధంగా నమోదు కావడం ఇది రెండోసారి. 2011లో కూడా అమెరికా జైళ్లలో జర్నలిస్టులు లేరు. అయినా ఈ దేశాలలో జర్నలిస్టులు స్వేచ్ఛగా తమ వృత్తిని కొనసాగించడంలో పలు సవాళ్ళను ఎదుర్కొంటున్నారు. సబ్- సహారా ఆఫ్రికా దేశాలలో 17 మందిని జైళ్ళలో నిర్బంధించిన ఇరిటరియాలో పరిస్థితులు అధ్వాన్నంగా ఉన్నాయని చెప్పవచ్చు. అరెస్ట్ చేసిన వారిపై ఆరోపణలు నమోదుచేయడంలో ఈ దేశాన్ని ప్రపంచంలోనే అధ్వాన్నమైనదిగా పేర్కొనవచ్చు. ఎవరిని ఎందుకు అరెస్ట్‌చేశారు, ఏ ఆరోపణలపై శిక్ష విధించారు, ఎందుకు విడుదల చేశారు- వంటి అంశాలు అసలు బయటకు రానేరావు. జైళ్ళలో ఉంటున్న ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌ల సంఖ్య 2011నుండి తగ్గుతోంది. 2015లో ప్రపంచ వ్యాప్తంగా జైళ్లలో ఉన్న జర్నలిస్టుల్లో ఫ్రీలాన్సర్లు 28 శాతం ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా జైళ్ళలో ఉన్న జర్నలిస్టులలో 109 మంది ఆన్‌లైన్‌లో పనిచేసేవారు కాగా, 83 మంది ప్రింట్ మీడియాలో పనిచేస్తున్నవారు బంగ్లాదేశ్, గాంబి యా, భారత్, సౌది అరేబియాలో కూడా జైళ్ళలో ఉన్న జర్నలిస్టుల సంఖ్య పెరిగారు. 2014లో ఒక్కరిని కూడా అరెస్ట్‌చేయని టుర్క్‌మినిస్థాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేటస్‌లలో ఈ సంవత్సరం అరెస్టులు జరిగాయి. అయితే సి.పి.జె. నివేదికలో వెలుగులోకి వస్తున్న వివరాలు ప్రభుత్వాలు అధికారికంగా అరెస్ట్‌చేసిన జర్నలిస్టులకు సంబంధించినవి మాత్రమే. అదృశ్యం అయినవారు, అపహరణకు గురయినవారు, ప్రయివేటు సంస్థల నిర్బంధంలో ఉన్నవారు లెక్కలోకి రారు. సి.పి.జె. అంచనా ప్రకారం మిడిల్ ఈస్ట్, నార్త్ ఆఫ్రికా దేశాలలో 40 మంది కనిపించడం లేదు. వారిలో చా లామందిని ఐసిస్ వంటి మిలిటెంట్ గ్రూప్‌లు అదుపులోకి తీసుకున్నట్లు భావిస్తున్నారు.
మరోవంక ప్రపంచవ్యాప్తంగా 1992నుండి 1172 మంది జర్నలిస్ట్‌లు తమ వృత్తిరీత్యా హత్యలకు గురయ్యారు. అత్యధికంగా ఇరాక్‌లో 171 మంది, సిరియాలో 91, ఫిలిప్పీన్స్‌లో 78, అల్బేరియాలో 60, సోమానియాలో 58, పాకిస్థాన్‌లో 57, రష్యాలో 56, కొలంబియాలో 47, భారత్‌లో 37, బ్రెజిల్‌లో 36 మంది ఉన్నారు. జర్నలిస్ట్‌లలో అత్యిధికంగా ఆన్‌లైన్‌లో వ్రాస్తున్నవారు, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌లు ఎక్కువగా దాడులకు, అరెస్ట్‌లకు గురవుతూ ఉండటం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా జర్నలిస్ట్‌లపై జరుగుతున్న దాడులను ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఇటీవల ఖండించింది. ముఖ్యంగా సాయుధ ఘర్షణ వాతావరణం నెలకొన్న ప్రాంతాలలో అపహరణకు గురైన, నిర్బంధంలోఉన్న జర్నలిస్ట్‌లు అందరినీ వెంటనే విడుదలచేయాలని డిమాండ్ చేసింది.
2002లో పాకిస్థాన్‌లో తీవ్రవాదులు తలగొరికి పంపిన వాల్‌స్ట్రీట్ జర్నల్ రిపోర్టర్ డెనియల్ పౌల్ ఈ సమావేశంలో మాట్లాడుతూ నేడు ప్ర పంచంలో పత్రికా ప్రతినిధులకు రక్షణ లేకుండాపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. 2014లో పత్రికల వారిపై దాడులకు బాధ్యులైన వారిలో 96 శాతం మంది ఎటువంటి శిక్ష లేకుండా తప్పించుకున్నారని తెలిపారు. కేవలం 4 శాతం మందికి మాత్రమే పాక్షిక న్యాయం జరిగిందని అన్నారు. కేవలం సంచలనం కోసమే తీవ్రవాద సంస్థలు పత్రికలవారిని ఎక్కువగా అపహరిస్తున్నార న్నారు. నేడు సిరియా ప్రపంచంలో అత్యంత ప్రమాదకర ప్రదేశంగా మారింది. 2011లో ఘర్షణలు ప్రారంభమైన తర్వాత కనీసం 80 మంది మృతి చెం దారు. సాయుధ ఘర్షణలు నెలకొన్న ప్రాంతాలలో హత్యలకు గురవుతున్న జర్నలిస్టులలో 95 శాతం మంది స్థానిక జర్నలిస్టులే.
పాత్రికేయునిగా పనిచేయడం నేడు ప్రమాదకరంగా మారింది. విమర్శలను, నిరసనను సహించలేని స్థితిలో ప్రభుత్వాలు, రాజకీయ వర్గాలతోపాటు తీవ్రవాద బృందాలు కూడా ఉండటం అందుకు ప్రధాన కారణం.

- చలసాని నరేంద్ర