జాతీయ వార్తలు

జేఎన్‌యూ వద్ద భారీ బందోబస్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: జవహర్‌లాల్ నెహ్రు యూనివర్శిటీ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. యూనివర్శిటీ హాస్టల్ మెస్ ఛార్జీలు పెంచాలని అధికారులు నిర్ణయం తీసుకోవటంతో విద్యార్థులు ఆందోళనకు పిలుపునిచ్చారు. ఈరోజు పార్లమెంటును ముట్టడించాలని విద్యార్థులు పిలుపునివ్వటంతో పోలీసులు అనుమతినివ్వలేదు. దీంతో దాదాపు 1200 మంది పోలీసులు మోహరించారు. జేఎన్‌యూతో పాటు పార్లమెంటు పరిసరాల్లో 144 సెక్షన్ విధించారు. అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఇదిలావుండగా జవహర్‌లాల్ నెహ్రు యూనివర్శిటీ హస్టల్ ఛార్జీలపై కేంద్రం స్పందించి త్రిసభ్య కమిటీ వేసింది. ఈ మేరకు కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. యూనివర్శిటీలో సాధారణ పరిస్థితులు నెలకొనేలా చూడాలని కోరింది.