అంతర్జాతీయం

జపాన్ ప్రధాని పర్యటన వాయిదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఈ నెల 15 నుంచి 17 వరకు గౌహతిలో జరగాల్సిన భారత్-జపాన్ సమ్మిట్‌కు జపాన్ ప్రధాని షింజో అబే రావటం లేదనే ప్రచారం ఆ దేశ మీడియాలో వస్తోంది. పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా అస్సాం అట్టుడుకిపోతుంది. ఈ నేపథ్యంలో ఇక్కడే జరిగే సమ్మిట్‌కు జపాన్ ప్రధాని హాజరవుతున్నారా లేదా అనే సందిగ్దం నెలకొంది. దీనిపై విదేశాంగ ప్రతినిధి రమేశ్ కుమార్ మాట్లాడుతూ ఈ సమ్మిట్ నిర్వహించాలా వద్దా అనేది దానిపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. ఈశాన్య రాష్ట్రాల్లో జరుగుతున్న ఆందోళనలతో ఇప్పటికే బంగ్లాదేశ్ హోంమంత్రి, విదేశాంగ మంత్రులు తమ పర్యటనలను రద్దు చేసుకున్నారు.