తెలంగాణ

జనగామ కోర్టుకు హాజరైన ఐఎస్‌ఐ ఉగ్రవాది ఖాజా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జనగామ , డిసెంబర్ 4: కోర్టుకేసులో ఐఎస్‌ఐ ఉగ్రవాది ఎస్‌కె అబ్దుల్ ఖాజా శుక్రవారం వరంగల్ జిల్లా జనగామ కోర్టుకు హాజరయ్యారు. 11-11-11రోజున పేరుమోసిన ఉగ్రవాది వికారొద్దీన్‌తో పాటు మరో నలుగురు ఉగ్రవాదులను హైద్రాబాద్ నుండి వరంగల్‌కు తరలిస్తుండగా తమకు బిర్యానీ కావాలని వారు ఎస్కార్ట్ పోలీసులపై తిరగబడగా వారు జనగామ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆ కేసులో సంబంధిత ఉగ్రవాదులు జనగామ కోర్టుకు హాజరైన విషయం విదితమే. కాగా 2015 ఏప్రిల్ 7న వారిని వరంగల్ నుండి హైద్రాబాద్‌కు తరలిస్తున్న సమయంలో పెంబర్తి- ఆలేరు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో వికారొద్దీన్‌తో పాటు ఆ ముఠాకు చెందిన సయ్యద్ అంజద్, ఇజాజ్‌ఖాన్, మహ్మద్ అనీఫ్, మహ్మద్ జకీర్‌లు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ సమయంలో ఆ ముఠాలో ఓ సభ్యుడైన ఎస్‌కె అబ్దుల్ ఖాజా వేరొక కేసు నిమిత్తం అండమాన్ జైలులో ఖైదీగా ఉన్నాడు. ప్రస్తుతం అతను హైద్రాబాద్ చర్లపల్లి జైలులో ఖైదీ జీవితం అనుభవిస్తున్నాడు. కాగా, బిర్యానీ కేసులో శుక్రవారం జనగామ కోర్టుకు హాజరై ఆయన వాదనను వినిపించారు. ఈ నెల 18కి కేసు వాయిదా పడిందని అధికారులు తెలిపారు. ఆర్‌ఎస్‌ఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ప్రత్యేక వాహనంలో ఉగ్రవాది అబ్దుల్ ఖాజాను హైద్రాబాద్ నుండి జనగామ కోర్టుకు హాజరుపర్చారు. ముందస్తు జాగ్రత్తగా స్థానిక ఎస్సై కర్ణాకర్ పోలీసు సిబ్బందితో కోర్టు ఆవరణలో బందోబస్తు నిర్వహించారు. కోర్టుకు హాజరుపర్చిన అనంతరం తిరిగి చర్లపల్లి జైలుకు తరలించారు.