జనాంతికం - బుద్దా మురళి

కారణజన్ములు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘నీలో నువ్వే నవ్వుకుంటున్నావ్..’’
‘‘ఔను.. నా ప్రపంచంలో నేనున్నా..’’
‘‘అదేంటి? ప్రపంచం అంటే అందరికీ ఒకటే కదా? నీకో ప్రపంచం ఉందా? విడిగా..’’
‘‘ఈ విశాల విశ్వంలో భూమిలాంటి గ్రహాలు ఎన్నో ఉన్నాయని సైన్స్ చెబుతుంది కదా? ’’
‘‘ఇప్పుడున్న విశ్వంలో మన ప్రపంచం ఏమిటో అర్థం కాక చస్తుంటే నీ సొంత ప్రపంచమా?’’
‘‘మనకు అర్థం కానీ విశ్వం సంగతి వదిలేద్దాం. నిజంగానే ఎవరి ప్రపంచం వారికుంటుంది.’’
‘‘నీ ప్రపంచం ఎక్కడుంది?’’
‘‘ఇంత సంక్లిష్ట అంశాన్ని ఈ మధ్య రాంగోపాల్ వర్మ ఎంత సింపుల్‌గా చెప్పాడో తెలుసా?’’
‘‘వర్మ సింపుల్ విషయాలను సంక్లిష్టంగా మారుస్తాడని తెలుసు కానీ సంక్లిష్ట విషయాలను సింపుల్‌గా చెబుతాడా? ఏం చెప్పాడు?’’
‘‘ఇప్పుడు నువ్వు, నేను మాట్లాడుకుంటున్నాం కదా? నా ప్రపంచంలో ఇద్దరమే ఉన్నాం. ఇంకా మాట్లాడితే నేనొక్కడినే ఉన్నాను. మన ఇద్దరం మాట్లాడుకుంటున్నాం. జాగ్రత్తగా కిందికి చూడు ఏం కనిపిస్తుందో..’’
‘‘నేల తప్ప ఏమీ కనిపించడం లేదు’’
‘‘నేలపై నాలుగైదు చీమలున్నాయి. కనిపిస్తున్నాయా?’’
‘‘కనిపిస్తే.. మన ప్రపంచంలో మనమిద్దరమే ముఖ్యం. ఆ చీమలను పట్టించుకోం. అచ్చంగా ఆ చీమలు కూడా మనలానే మాట్లాడుకుంటాయి. మన దృష్టిలో అవి పట్టించుకోదగ్గ అవసరం లేనివి.. వాటి దృష్టిలో నాలుగైదు చీమలే ముఖ్యం. మనల్ని అస్సలు పట్టించుకోవు’’
‘‘అంటే?’’
‘‘మన దృష్టిలో మనం ముఖ్యం. మిగతావి చీమలు, దోమలు. వాటి ప్రపంచంలో మనల్ని పట్టించుకోవు. ప్రపంచం అంటే ఇదేనోయ్’’
‘‘వేదాంతమా?’’
‘‘కాదు వాస్తవం’’
‘‘నీ ప్రపంచంలో ఎవరెవరున్నారు?’’
‘‘నీకు ఆశ్చర్యం అనిపించవచ్చు కానీ నా ప్రపంచంలో నువ్వు కూడా లేవు’’
‘‘ఎవరున్నారో చెప్పు?’’
‘‘కేఏపాల్, చిట్టినాయుడు, బాలకృష్ణ..’’
‘‘హా..హా...’’
‘‘నువ్వు నవ్వుకున్నా, నమ్మకున్నా అదే నిజం’’
‘‘అదేంటోయ్.. నీ ప్రపంచంలో నీ మాజీ ప్రేయసి ఉందంటే ఏదో అనుకోవచ్చు. కోట్ల రూపాయల సంపద ఉందంటే కావచ్చు అనుకుంటా.. కానీ నీకు సంబంధం లేని పాల్, చిట్టినాయుడు, బాలకృష్ణ నీ ప్రపంచంలో ఉండడమే నమ్మలేకపోతున్నాను.’’
‘‘మంగళగిరి ప్రజలు అదృష్టవంతులు..’’
‘‘ఎక్కడి నుంచో ఎక్కడికో వెళుతున్నావు’’
‘‘అక్కడికే వస్తున్నా.. ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో మంగళగిరి ప్రజలకు అదృష్టం జిడ్డులా పట్టుకుంది’’
‘‘ఏమైంది?’’
‘‘బాలమేధావి, విశ్వనాయకుడు పాల్ ఇద్దరూ అదే నియోజకవర్గం నుంచి ప్రజలకు సేవ చేయాలని నిర్ణయించుకున్నారు’’
‘‘ఎవరు వాళ్లు?’’
‘‘మహాత్మా గాంధీ తెలుసు కదా?’’
‘‘ఆయన బంధువులా?’’
‘‘పూర్తిగా విను.. హాస్యం లేకపోతే నేనెప్పుడో పైకి పోయేవాడిని అని గాంధీ చెప్పారంటే ఇక నువ్వు, నేను, మంగళగిరి ఓటరు ఎంత?’’
‘‘అర్థం కాలేదు..’’
‘‘పిల్లలు దేవుని రూపం అంటారు. డాక్టర్లను దైవంగా చూస్తారు. డాక్టర్ కన్నా తమ హాస్యం ద్వారా రోగాలనే దరి చేరనివ్వకుండా చూసే వాళ్లు దేవుళ్లు కాకుండా మరేంటి?’’
‘‘ఐతే.. మంగళగిరికేం సంబంధం?’’
‘‘దేవుడి లాంటి ఇద్దరు మంగళగిరి నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు’’
‘‘దేవుళ్లా.. ఎవరు వారు?’’
‘‘ఒకరు చిట్టినాయుడు.. ఇంకొకరు విశ్వనాయకుడు పాల్’’
‘‘వాళ్ల అభిమానులకు దేవుళ్లేమో కానీ అందరికీ దేవుళ్లు కావడం ఏంటి?’’
‘‘నవ్వుల్లో ముంచెత్తి మన ఆయుష్సును పెంచే వాళ్లు దేవుళ్లు కాక మరేమిటి? ఎంత కష్టాల్లో ఉన్నా ఒక్కసారి వారి వీడియో చూడు.. నీ ముఖం మీద నవ్వు మెరిసిపోక పోతే నన్నడుగు. మెగాస్టార్, సూపర్ స్టార్, విశ్వవిఖ్యాత నటుల కన్నా వీరిద్దరి వీడియోలకే యూ ట్యూబ్‌లో ఆదరణ ఎక్కువ. ఈ విషయం పాల్ స్వయంగా చెప్పారు కూడా. తాను మాట్లాడితే ఒక్క చానల్ కూడా లైవ్‌లో చూపడం లేదని బాధపడ్డారు. ఎంత పెద్ద నాయకుడి ఉపన్యాసం ఐనా యూ ట్యూబ్‌లో స్వల్ప సంఖ్యలోనే చూస్తారు. కానీ తన ఉపన్యాసాన్ని యూ ట్యూబ్‌లో లక్షల మంది చూస్తారని చెప్పారు.’’
‘‘నిజమే.. ఏ నాయకుడి ఉపన్యాసం ఐనా ఆ పార్టీ వాళ్లే చూస్తారు కానీ- లోకేశ్, బాలకృష్ణ లాంటి వారి ఉపన్యాసాలను సొంత పార్టీ వారితో పాటు పార్టీలకు అతీతంగా అంతా ఆదరిస్తారు. ’’
‘‘చార్లీ చాప్లిన్‌ను ప్రాంతాలకు అతీతంగా చూస్తాం. నవ్వుల్లో ముంచెత్తే వారిని అన్నింటికీ అతీతంగా చూడాలి. నేను ఇంత ఆరోగ్యంగా నవ్వుతూ ఉండడానికి, నా ప్రపంచంలో నేను ఉండడానికి- నా ప్రపంచంలో వాళ్లు ఉండడమే కారణం’’
‘‘ఏంటో.. వాళ్లు చేసిన అంత గొప్ప సేవ?’’
‘‘వివేకానంద రెడ్డిని హత్య చేస్తే చిట్టినాయుడు ఏమన్నాడో తెలుసా? పరవశించాడట!’’
‘‘ఎందుకా పరవశం?’’
‘‘ఒక మనిషి చనిపోతే బాధపడతాం. ఎడ్లబండ్లు కూడా లేని కాలంలో అలా బాధపడ్డాం. అరచేతిలో ప్రపంచం ఇమిడిపోయిన ఈ కాలంలోనూ బాధపడాలా? అందుకే సంస్కరణవాది చిట్టినాయుడు పరవశించానని చెప్పాడు.’’
‘‘అన్నీ మారినప్పుడు భావోద్వేగాలు ఎందుకు మారకూడదు’’
‘‘అంతకుముందు ఆయన మామగారు తన సోదరుడైన హరికృష్ణ చనిపోతే సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు!’’
‘‘కొత్తపదాలు, కొత్త్భావాలను ఎవరో ఒకరు మొదలు పెట్టక పోతే ఎలా వస్తాయి?’’
‘‘ఆదిమానవులు సమూహంగా జీవించారు. క్రమంగా వివాహ వ్యవస్థ పుట్టింది. ఇప్పుడు సహజీవన వ్యవస్థ పుట్టింది. అన్నీ మారుతున్నప్పుడు భావోద్వేగాల్లో మార్పు ఉండాలి..’’
‘‘కొత్త కొత్త పదాలు పుట్టిస్తూ నవ్వుల్లో ముంచెత్తుతున్న చిట్టినాయుడు, పెద్దబాలకృష్ణ, పాల్ లాంటి వారు మన ప్రపంచంలో ఉండడం దేవుడు మనకిచ్చిన వరం. వారు కారణజన్ములు.’’
*

buddhamurali2464@gmail.com