జనాంతికం - బుద్దా మురళి

కాలా.. బాహుబలి.. కెవ్వుకేక!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘చెల్లెమ్మా.. గులాభ్ జాం తియ్యగా ఉంది.. మరో రెండు పట్రా..’’
‘‘దుర్మార్గుడా! అవేం మాటలురా!?’’
‘‘చెల్లెమ్మా అనడం దుర్మార్గమా?’’
‘‘కాదు.. ఆ తరువాత ఏమన్నావు?’’
‘‘గులాబ్ జాం తియ్యగా ఉందన్నాను’’
‘‘నువ్వో కవివి, అందులోనూ మేధావి కవివి. ఒక సామాన్యుడు తన బతుకు పోరాటంలో ఓడిపోయి సామాజిక స్పృహ లేక గులాబ్ జాం తియ్యగా ఉంది అంటే అర్థం చేసుకోవచ్చు. కానీ ఓ కవిగా నీ సామాజిక బాధ్యత ఏమైంది? నువ్వు కూడా విప్లవ ప్రతీఘాతక శక్తిగా, విప్లవ ద్రోహిగా మారిపోతావా? గులాబ్ జాం తియ్యగా ఉందని ఒక పెట్టుబడి దారుడు, ఓ స్వార్థపరుడు అన్నట్టుగానే నువ్వూ అంటున్నావ్.. కాగితం పూలు అనే కవితలో నువ్వు చెప్పిన విప్లవం ఇదేనా? ’’
‘‘కూరలో ఉప్పు తక్కువయినా, టీలో చెక్కెర ఎక్కువయినా నేనేమీ భయపడకుండా నిర్మోహమాటంగా చెబుతాను. ఇంట్లో నాకా స్వేచ్ఛ ఉంటుంది. ఇప్పుడూ అదే మాట చెప్పా.. నేను చెప్పిన దాంట్లో తప్పేముంది?’’
‘‘అందరిలా కళ్లు, నాలుక పనిచేస్తే ఇక కవిని అని చెప్పుకునే అర్హత నీకేముంది? నువ్వు భిన్నంగా చూడాలి.’’
‘‘అంటే సర్వపిండి తియ్యగా ఉందని, గులాబ్ జాం కారంగా ఉందని చెప్పాలా? సర్వపిండిని ఎవరైనా తియ్యగా చెస్తారా? సర్వపిండి చేయడం రాని వారు ఉండొచ్చు, కానీ సర్వపిండిని తియ్యగా చేసేవారు ఎవరూ ఉండరు.’’
‘‘మేధావులను మొదట్లో అంతా పిచ్చోళ్లుగానే చూస్తారు?’’
‘‘పిచ్చోళ్లుగా కనిపించిన వారంతా మేధావులు కాదు’’
‘‘అంటే భిన్నంగా చూడకుండా అందరిలానే చూస్తానంటావు.’’
‘‘అలా ఏమీ అనలేదు.’’
‘‘ఏంటోయ్.. మిత్రులిద్దరూ ఏదో హాట్‌హాట్‌గా చర్చించుకుంటున్నారు’’
‘‘రావోయ్ రా! ఏమీ లేదు.. మేం తరువాత చర్చించుకుంటాం.. ఎక్కడి నుంచి రాక?’’
‘‘కాలా సినిమా చూసొస్తున్నా... చూడని వారిదే పాపం’’
‘‘నేను చూడలేదు, చూసే ఉద్దేశం లేదు.. అంటే నేను పాపాత్ముణ్ణా’’
‘‘ఇప్పటి దాకా గులాబ్ జాం తియ్యగా ఉందని నాతో వాదించావు. ఇప్పుడు సినిమా చూడనని అంటావా? నువ్వసలు మనిషివేనా?’’
‘‘ఆ సినిమా చూస్తేనే మనిషా? ఉచితంగా చూపిస్తున్నారా? పోనీ రజనీకాంత్ ఉచితంగా నటించాడా? హాలు వాళ్లు ఉచితంగా ప్రదర్శిస్తున్నారా?’’
‘‘అసలేం మాట్లాడుతున్నావ్? సినిమా అనేది కోట్ల రూపాయల పెట్టుబడితో సాగే కళాత్మక వ్యాపారం. ఉచితంగా నటించేందుకు రజనీకాంత్‌కేం పట్టింది. ఆయన కాల్షీట్స్ దొరకడమే కష్టం. ’’
‘‘మరి- ఆ సినిమా చూడక పోతే పాపం అని ఎందుకంటున్నావ్? ’’
‘‘దురహంకారంతో ఇలా మాట్లాడుతున్నావ్? ’’
‘‘ నేను రాసిన కాగితం పూలు కవితా సంకలనాన్ని ఒక్కడంటే ఒక్కడన్నా కొ న్నాడా? కాలా సినిమా చూడని నేను దురహంకారుణ్ణే. నా కవితా సంకలనం కొనని ప్రతి తెలుగువాడూ దురహంకారే. కొనలేదు సరి కదా? ఉచితంగా పంచి పెట్టినా ఒక్కరు కూడా చదివి బాగుందని చెప్పలేదు. ’’
‘‘నీ కవితా సంకలం చదవక పోతే అంతేనా?’’
‘‘మరి నీకు నచ్చిన సినిమా చూడక పోతే అంతేనా?’’
‘‘నువ్వు సినిమా చూడకపోవడమే కాకుండా.. సమర్ధించుకోవడం నీ స్నేహితుడే కాదు. ఒక తటస్థునిగా నేను జీర్ణం చేసుకోలేకపోతున్నాను.’’
‘‘నీ జీర్ణం నీ ఇష్టం నా నిర్ణయం నా ఇష్టం. ఇంకో షాకింగ్ న్యూస్ చెప్పనా?’’
‘‘నేను బాహుబలి-1, 2 సినిమాలే చూడలేదు. చూసే ఉద్దేశం కూడా లేదు’’
‘‘వ్వాట్.. నిజమా..? అసలు నువ్వు 21వ శతాబ్దపు మనిషివేనా? ఏదో తమిళ డబ్బింగ్ అంటే సరిపెట్టుకోవచ్చు. తెలుగుజాతి గౌరవాన్ని చైనాలో చూపించిన రాజవౌళి బాహుబలి చూడలేదా? ఆ మాట చెప్పడానికి సిగ్గుగా లేదా? ’’
‘‘ఒక్క చైనానే కాదు ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోయిందని తెలుగు మీడియా చెప్పిన సినిమా అది.. చూడలేదా? ’’
‘‘నిజంగా చూడలేదు. అంతా నన్ను అనుమానంగా చూస్తుంటే డాక్టర్‌ను కలిశాను. ఆ సినిమా చూడక పోయినా నా కాళ్లు, చేతులు బాగానే పని చేస్తున్నాయి. షుగర్ లేదు. తల గిర్రున తిరగడం వంటి సమస్యలు లేవు. బీపీ కూడా నార్మల్‌గానే ఉంది. నేను చూడకపోవడం వల్ల రాజవౌళికి కూడా ఏమీ కాలేదు.. బాగానే ఉన్నాడు. ’’
‘‘నీకు నార్మల్‌గా ఉందేమో కానీ.. నువ్వు బాహుబలి చూడలేదంటే నాకు బీపీ పెరిగేట్టుగా ఉంది’’
‘‘ ఆ మధ్య నేను చిన్న రేడియోలో పాత పాటలు వింటుంటే ఒకడొచ్చి స్కోరెంత? అన్నాడు. ఎన్నో పాటనో అడుగుతున్నాడనుకుని మూడు అని చెప్పా! ఇండియా- పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ స్కోర్ అని వాడు మళ్లీ అడిగితే ఏం క్రికెట్..? ఏం మ్యాచ్..? అని అడిగా.. అంతే- వాడికి బీపీ పెరిగి పిచ్చిచూపులు చూస్తూ వెళ్లిపోయాడు’’
‘‘బాహుబలి చూడని తెలుగు వాడుంటాడా? ’’
‘‘నేనున్నాను కదా? ఇంకోటి చెప్పనా? గుండె ధైర్యంతో విను. నేను శంకరాభరణం చూడలేదు. మహానటి కూడా చూడను. ఇప్పుడేమంటావో అను..’’
‘‘ కెవ్వుకేక.. నువ్వు మొత్తం తెలుగు జాతికే అవమానం’’
‘‘పోనీ- ఏం సినిమాలు చూశావో చెప్పు ?’’
‘‘ఐదారేళ్ల క్రితం- చందన బ్రదర్స్ బొమ్మన సిస్టర్స్ వచ్చింది గుర్తుందా? రెండు గంటలు హాయిగా నవ్వుకోవచ్చు అని చూశా..
‘‘చీ..చీ.. అలాంటి సినిమాలు చూస్తావా? పోనీ సినిమా టికెట్లు ఇస్తే వెళతావా?’
‘‘వెళ్లను.. నాకు నచ్చినట్టుగానే నా సమయాన్ని ఖర్చు చేస్తా? చూడాలనిపిస్తే టీవీలో వచ్చినప్పుడు నచ్చినంత టైం చూస్తా. నేను కామన్ మేన్‌ని.. నాకున్న సమస్యలు మరిచిపోవడానికి రెండు గంటలు హాయిగా నవ్వుకోవడానికి, నా డబ్బుతో నాకు నచ్చిన సినిమాకు వెళతాను. మీరిచ్చే సర్ట్ఫికెట్ల కోసం సినిమాకు వెళ్లను. కాగితం పూలు కవితా సంకలనం చదవలేదని ఈ సమాజాన్ని నేనేమైనా నిలదీశానా? వాళ్లకు నచ్చిన సినిమా చూడలేదని ననె్నలా నిలదీస్తుందీ సమాజం? ఇంకో సంగతి తెలుసా? కొన్ని దశాబ్దాల పాటు సినిమాల్లో నటించిన జమున లాంటి వాళ్లు చాలా మంది సినిమా హాళ్లకు వెళ్లడం మానేసి దశాబ్దాలు అయిందని చెబుతున్నారు. సినిమా హాళ్లకు వెళ్లని వారిని సమాజం నుంచి బహిష్కరిస్తావా?’’ *

buddhamurali2464@gmail.com