రాష్ట్రీయం

కరీంనగర్ మున్సిపల్ కమిషనర్‌కు 2 నెలల జైలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదేశాలను నాలుగువారాల పాటు సస్పెండ్ చేసిన హైకోర్టు

హైదరాబాద్, డిసెంబర్ 3: కోర్టు ధిక్కరణ కేసులో కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ కె.వి. రమణాచారికి రెండు నెలల జైలు శిక్ష విధిస్తూ హైకోర్టు న్యాయమూర్తి ఎం. రామచంద్రరావు గురువారం తీర్పు ఇచ్చారు. గతంలో హైకోర్టు ఒక కేసులో భూమిని సేకరించి తగిన నష్టపరిహారం చెల్లించాలని కరీంనగర్ నగరపాలక సంస్ధను ఆదేశించింది. కాని కోర్టు ఆదేశాలను నగరపాలక సంస్ధ అమలు చేయలేదంటూ ఎస్ మణెమ్మ మరో ఇద్దరు హైకోర్టులో కోర్టు ధిక్కరణ కేసును దాఖలు చేశారు. పిటిషనర్ల తరఫున న్యాయవాది ఎన్‌వి రామానుజం వాదిస్తూ తమ పిటిషనర్లు భూమి కొనుగోలు చేసి ఇంటి నిర్మాణానికి ప్లాన్‌ను జతపరిచి కరీంనగర్ నగరపాలక సంస్ధకు దరఖాస్తు చేశారన్నారు. కాని ఈ భూమి భూ సేకరణలో ఉందని అందుకే ప్లాన్‌ను ఆమోదించమని అధికారులు తెలిపారన్నారు. ఇప్పటికే ఈ భూమి నగరపాలక సంస్ధ ఆధీనంలో ఉందని అధికారులు తెలిపారు. కాగా 1966లో అభివృద్ధి చేసిన లే అవుట్ భూమిలో ప్రజల ప్రయోజనం నిమిత్తం భూసేకరణ చేస్తామన్న నిబంధన లేదని హైకోర్టు గుర్తించింది. కాగా అవసరమైతే భూమిని సేకరించి, తగిన నష్టపరిహారం చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది. నగరపాలక సంస్థ హైకోర్టు ఆదేశాన్ని అమలు చేయలేదని పిటిషనర్లు కోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ కేసును విచారించి కమిషనర్ రమణాచారికి 2నెలల జైలు, 15వేల రూపాయల జరిమానాను విధించింది. అనంతరం ఈ తీర్పు నాలుగు వారాల పాటు సస్పెండ్ చేసింది. ఈ కేసులో కమిషనర్ అప్పీల్ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు హైకోర్టు పేర్కొంది.