జాతీయ వార్తలు

వైఎస్ జగన్ సర్కార్‌కు మెగాస్టార్ అభినందనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: వైఎస్ సర్కార్‌పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శల దాడి కొనసాగుతుంటే ఆయన సోదరుడు, మెగాస్టార్ చిరంజీవి మాత్రం అభినందనలు అందజేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు అండగా నిలిచేలా 'ఏపీ దిశ చట్టం' తీసుకు రానుండడాన్ని మెగాస్టార్ చిరంజీవి అభినందించారు. మహిళలపై అత్యాచారాలు చేసే వారికి మరణ దండన విధించడమే సరైన శిక్షని చిరంజీవి ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. ఇటువంటి చట్టాన్ని తొలుత తెలుగు రాష్ట్రమైన ఏపీ తీసుకురావడం గర్వకారణమని చిరంజీవి వ్యాఖ్యానించారు. ఇదిలావుండగా ఇరవై ఒక్క రోజుల్లోనే రోజుల్లోనే విచారణ పూర్తి చేసేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు, దోషులకు మరణదండన విధించేలా కొత్త చట్టాన్ని తీసుకురావాలని ఏపీ కేబినేట్ నిర్ణయించిన సంగతి తెలిసిందే.