జాతీయ వార్తలు

బొగ్గు వినియోగంతో తగ్గనున్న వర్షపాతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, మే 2: భారత్, చైనా వంటి ఆసియా దేశాలలో వేగంగా పెరుగుతున్న బొగ్గు వినియోగం వల్ల భవిష్యత్తులో రుతుపవన వ్యవస్థలు బలహీనపడే అవకాశం ఉందని, తద్వారా వర్షపాతం తగ్గే ప్రమాదం ఉందని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. పర్యావరణ పరిరక్షణకు సంబంధించి ఇటీవల ఒప్పందాలు జరిగినప్పటికీ, నిరుడు డిసెంబర్‌లో ప్యారిస్‌లో వాతావరణ మార్పుపై జరిగిన చర్చల్లో ప్రతిన బూనినప్పటికీ, ఆసియా ఖండంలో విద్యుత్ ఉత్పాదనకు బొగ్గును మండించడమే ప్రధాన వనరుగా ఉంది. భారత్, చైనాలలో మానవ కార్యకలాపాల ద్వారా వెలువడిన సల్ఫర్ డయాక్సైడ్ (ఎస్‌ఒ2) ఉద్గారాలలో సింహభాగానికి బొగ్గును మండించడమే కారణమని ఈ అధ్యయనం పేర్కొంది.
ఈ సల్ఫర్ డయాక్సైడ్ ఉద్గారాలు వాతావరణంలో సల్ఫేట్ ఏరోసోల్స్ కేంద్రీకృతం కావడానికి దారితీస్తాయి. ఈ ఏరోసోల్స్ ఆ రీజియన్‌లో ప్రజారోగ్యానికి ప్రమాదకరమే కాకుండా, ఆ రీజియన్‌లో, ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పుకు దారితీస్తాయి. రానున్న సంవత్సరాలు, దశాబ్దాలలో ఆసియా విద్యుత్ ఉత్పత్తికి ఎంచుకునే మార్గాలపై వాతావరణ మార్పు ఏ స్థాయిలో ఉంటుందనేది ఆధారపడి ఉంటుందని పరిశోధకులు పేర్కొన్నారు. భారత్, చైనా, వేగంగా వృద్ధి చెందుతున్న ఇతర ఆసియా దేశాలలో ఆర్థికాభివృద్ధి, విద్యుత్‌కు ఏర్పడుతున్న డిమాండ్ బొగ్గు వినియోగం వేగంగా పెరగడానికి దారి తీస్తున్నాయని ఈ అధ్యయనం వెల్లడించింది. ఫలితంగా వాతావరణ మార్పుపై తీవ్ర ప్రభావం చూపుతోందని పేర్కొంది. ఆసియా బొగ్గు వినియోగానికి బదులు నేచురల్ గ్యాస్ వంటి స్వచ్ఛమైన ఇంధనాలను మండించడం ద్వారా, విండ్ టర్బైన్స్, ఫొటోవోల్టాయిక్స్ వంటి తక్కువస్థాయి కార్బన్ గల ఎనర్జీ టెక్నాలజీలను ఉపయోగించడం ద్వారా వాతావరణ మార్పుపై ప్రభావాన్ని క్రమంగా తగ్గించవచ్చని ఈ అధ్యయనం సూచించింది. ఈ అధ్యయనం జర్నల్ ఆఫ్ క్లైమేట్‌లో ప్రచురితమయింది.