అంతర్జాతీయం

ఇప్పట్లో భారత్‌కు రాను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, ఏప్రిల్ 29: దేశంలో బ్యాంకులకు వేలాది కోట్ల రూపాయలు ఎగవేసి లండన్ చెక్కేసిన మాజీ లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా భారత్‌కు తిరిగివచ్చేది లేదని తేల్చిచెప్పేశారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే తాను దేశం విడిచిరావల్సి వచ్చిందని ఆయన చెప్పారు. పాస్‌పోర్టు రద్దుచేయడం లేదా అరెస్టు చేయడం ద్వారా తన నుంచి బాకీ ఎలా వసూలు చేయగలరని ఆయన ప్రశ్నించారు. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు ఎగవేయాలన్న ఉద్దేశం లేదన్న మాల్య ఓ సహేతుకమైన పరిష్కారం చేసుకోవాలని భావిస్తున్నట్టు చెప్పుకొచ్చారు.‘నా పాస్‌పోర్టు రద్దుచేసి, అరెస్టు చేయడం ద్వారా ఒక్కపైసా వసూలు చేయలేరు’అని ఆయన స్పష్టం చేశారు.తాను కచ్చితంగా స్వదేశానికి తిరిగివస్తానని, దానికి ఇది సరైన సమయం కాదని మాల్యా పేర్కొన్నారు. పాస్‌పోర్టు రద్దు నిర్ణయం తీసుకున్న ప్రభుత్వ మున్ముందు ఏం చర్యలు తీసుకుంటుందోనని ఆయన వ్యాఖ్యానించారు. తనకు భారత్ అంటే ఎనలేని గౌరవమేకాక నిజమైన దేశభక్తుడినన్న అరవై ఏళ్ల మాల్య తప్పనిసరి పరిస్థితుల్లోనే దేశం విడిచిరావల్సి వచ్చిందని అన్నారు. యుకెలో తానెంతో సురక్షితంగా ఉన్నారని కింగ్‌ఫిషర్ అధినేత తెలిపారు. ఇప్పటికిప్పుడు లండన్ విడిచి వెళ్లాలన్న ఆలోచన తనకు లేదని ఆయన వెల్లడించారు. సెంట్రల్ లండన్ నుంచి మైఫెయిర్ ద్వారా నాలుగు గంటల సేపుఓ మీడియా సంస్థకు ఇంటర్‌వ్యూ ఇచ్చిన విజయ్ మాల్యా అనేక విషయాలపై మాట్లాడారు. మాల్యాను తమకు అప్పగించాలని భారత ప్రభుత్వం బ్రిటన్‌లు లేఖ రాసిన సంగతి తెలిసిందే. అలాగే లిక్కర్ కింగ్‌కు మనీలాండరింగ్ కేసు కింద నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. కింగ్‌ఫిషర్ కోసం తీసుకున్న రుణం సంస్థకే వెచ్చించాను తప్ప ఎలంటి అవకతకలకు పాల్పడడం లేదా నిధులు మళ్లించడం చేయలేదని మాల్యా తెలిపారు.