అంతర్జాతీయం

హిల్లరీపై పోటీయే ఇష్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఏప్రిల్ 22: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ నాయకురాలు హిల్లరీ క్లింటన్‌పైనే పోటీ చేయాలని తాను అనుకుంటున్నానని అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం మిగతా అందరికన్నా ముందున్న డోనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశాడు. హిల్లరీ ప్రత్యర్థి బెర్నీ శాండర్స్ ఆమెకు గట్టి పోటీ ఇస్తున్నప్పటికీ తాను మాత్రం శాండర్స్‌కన్నా కూడా హిల్లరీ క్లింటన్‌పైనే పోటీ చేయడానికి ఎక్కువ ఇష్టపడతానని ఈ నెల 26న ప్రైమరీ ఎన్నికలు జరగనున్న పెన్సిల్వేనియాలో గురువారం తన మద్దతుదారులనుద్దేశించి మాట్లాడుతూ ట్రంప్ అన్నారు. ‘కుటిల మనస్తత్వం కలిగిన హిల్లరీ క్లింటన్‌పై పోటీ చేయాలనే నేను అనుకుంటున్నాను. ఎన్నికల్లో మనం చిత్తుగా ఓడించబోతున్నాం. ఆమెకన్నా ఎక్కువ కుటిల మనస్తత్వం కలిగిన వారు ఎవరైనా ఉన్నారా?’ అని కూడా ట్రంప్ అన్నారు. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు పార్టీ నామినేషన్ పొందడానికి అవసరమైన 1237 మంది డెలిగేట్లకు ఇంకా చాలా దూరంలో ఉన్నప్పటికీ, ఆ మేరకు సంఖ్యాబలాన్ని సాధించగలనన్న గట్టి నమ్మకంతో ఉన్నందునే ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు కనిపిస్తోంది. అయితే హిల్లరీ క్లింటన్‌కు గట్టి పోటీ ఇస్తున్న వెర్మాంట్ సెనేటర్ బెర్నీ శాండర్స్‌ను ఆయన ప్రశంసలతో ముంచెత్తారు. విదేశాంగ మంత్రిగా హిల్లరీ క్లింటన్ అనేక ఘోరమైన తప్పులు చేశారని, ఇరాక్ యుద్ధానికి మద్దతు ఇవ్వడం వాటిలో ఒకటని ట్రంప్ అన్నారు.ప్ దీని కారణంగా అమెరికా మధ్యప్రాచ్యంలో 4 లక్షల కోట్ల డాలర్లు ఖర్చుచేయాల్సి వచ్చిందని ఆయన చెప్పారు. ప్రైమరీ ఎన్నికల్లో తదుపరి రౌండ్ ఎన్నికలు మేరీలాండ్, పెన్సిల్వేనియా, కనెక్టికట్, డెలవారే, రోడ్స్ ఐలాండ్ రాష్ట్రాల్లో జరగనున్నాయి. వచ్చే జూలైలో జరగబోయే పార్టీ మహాసభకన్నా ముందే పార్టీ అభ్యర్థిత్వాన్ని దక్కించుకోవలంటే ట్రంప్ ఈ అయిదు రాష్ట్రాల్లో భారీ మెజారిటీతో విజయం సాధించాల్సి ఉంటుంది.