అంతర్జాతీయం

అఫ్గాన్ సైన్యంపై తాలిబన్ల దాడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాబూల్, మార్చి 3: అఫ్గానిస్తాన్‌లో శాంతి అనుమానాస్పదంగానే మారిపోయింది. అమెరికాకు, తాలిబన్లకు మధ్య పాక్షిక సంధి కుదిరిన కొన్ని గంటలకే అఫ్గానిస్తాన్ సైనిక స్థావరాలపై తాలిబన్లు డజనుకు పైగా దాడులు చేశారు. అధికారులు మంగళవారం ఈ విషయం వెల్లడించారు. దీంతో అఫ్గానిస్తాన్ ప్రభుత్వానికి, తాలిబన్ తిరుగుబాటుదారులకు మధ్య జరగవలసి ఉన్న శాంతి చర్చలు సందేహంలో పడ్డాయి. దోహాలో శనివారం అమెరికాకు, తాలిబన్లకు మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం, అఫ్గానిస్తాన్ అంతర్గత చర్చలు మార్చి 10న ప్రారంభం కావలసి ఉంది. అయితే, ఖైదీల మార్పిడిపై ఏర్పడిన వివాదం వల్ల ఈ అంతర్గత చర్చలు ముందుకు సాగుతాయా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి.
అయితే, ఒప్పందం ప్రకారం, తాలిబన్లు తమ వద్ద బందీగా ఉన్న సుమారు వెయ్యి మందిని విడుదల చేయాలి. అఫ్గానిస్తాన్ ప్రభుత్వం సుమారు అయిదు వేల మంది తాలిబన్ ఖైదీలను విడుదల చేయాలి.
అయితే, చర్చలు ప్రారంభం కావడానికి ముందే ఈ ఖైదీలను విడుదల చేయాలని తాలిబన్లు షరతు విధించారు. కాని, చర్చలు ప్రారంభం కావడానికి ముందు ఈ ఖైదీలను విడుదల చేయడానికి అఫ్గానిస్తాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ నిరాకరించారు. ఈ వివాదంపై ఇరు పక్షాలు ఒక అంగీకారానికి రాకపోవడంతో పాక్షిక సంధికి సోమవారంతో ముగింపు పలకాలని తాలిబన్లు తీసుకున్న నిర్ణయం సమస్యను మరింత జటిలం చేసింది. దక్షిణ కాందహార్ రాష్ట్రంలో జరిగిన ఒక దాడిలో ఇద్దరు సైనికులు మృతి చెందారని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. కాబూల్‌కు సమీపంలోని లోగార్ రాష్ట్రంలో జరిగిన మరో దాడిలో అయిదుగురు భద్రతా సిబ్బంది మృతి చెందారు. అయితే, రక్షణ మంత్రిత్వ శాఖ అధికారులు ప్రకటించిన దాడుల మృతుల్లో ఈ దాడిని పేర్కొనలేదని ఆ రాష్ట్ర గవర్నర్ అధికార ప్రతినిధి దీదర్ లవాంగ్ తెలిపారు.
ఫిబ్రవరి 22వ తేదీన ప్రారంభమయిన పాక్షిక సంధి నిలిచిపోవడం ఇప్పటికే అంతర్యుద్ధంతో చితికిపోయిన అఫ్గానిస్తాన్ సాధారణ ప్రజలను మరింత ఛిద్రం చేసేదే.