అంతర్జాతీయం

అంగారక గుట్టు విప్పుతున్న ఇన్‌సైట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్: అంగారక గ్రహాన్ని మరింత లోతుగా అధ్యయనం చేయడంలో అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా)కు చెందిన ఇన్‌సైట్ ల్యాండర్ ఎప్పటికప్పుడు పురోగతి సాధిస్తోంది.
2018 నవంబర్‌లో అంగారక గ్రహంపై దిగిన ఈ ల్యాండర్ ఈ అరుణ గ్రహానికి సంబంధించి ఎన్నో రహస్యాలను వెలుగులోకి తెచ్చింది. అక్కడి వాతావరణం, స్థితిగతులు, ఉపరితలంపై సంభవించే ఉత్పాతాలు, వివిధ రకాల ధ్వనులను కూడా ఈ ల్యాండర్ పసిగట్టి నాసా శాస్తవ్రేత్తలకు అందించిందని తాజాగా జరిగిన ఓ అధ్యయనంలో వెల్లడైంది. అంగారక గ్రహంపై రోజువారీగా పీడన, ఉష్ణోగ్రత తారతమ్యాలు ఈ భూమి మీద కంటే కూడా చాలా ఎక్కువగానే ఉంటాయని ఈ అధ్యయన నివేదిక తెలిపింది. అలాగే, అక్కడి వాతావరణం అతి త్వరగా వేడెక్కి, అతి త్వరగా చల్లబడిపోతుందని తెలిపింది. భూమి మీద కంటే కూడా చాలా త్వరితగతినే ఈ రకమైన పరిస్థితులు అంగారకుడిపై చోటుచేసుకుంటాయని వెల్లడించింది. ముఖ్యం గా అక్కడ సంభవించే దుమ్ము, ధూళి తుపానులు ఈ గ్రహ వాతావరణంలో ఎప్పటికప్పుడు విస్తృత మార్పులు తీసుకువస్తాయని తెలిపింది. ఇన్‌సైట్ ల్యాండర్‌లో ఏర్పాటు చేసిన అనేక పరికరాలు ఈ గ్రహ అయస్కాంత శక్తిని కూడా ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నాయని, అలాగే దీని ఉష్ణోగ్రత గురించి కూడా వివరాలు అందిస్తున్నాయని అధ్యయన నిపుణులు తెలిపారు. ఈ గ్రహంపై తరంగాలకు సంబంధించి కూడా ల్యాండర్ ఎన్నో వివరాలు అందించిందని, వీటిని అధ్యయనం చేయడం ద్వారా దీని ఆనుపానులను మరింత లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని శాస్తవ్రేత్తలు తెలిపారు. అలాగే, ఇక్కడ సంభవించే ధ్వనులకు సంబంధించి మిస్టరీని ఛేదించాల్సి ఉందని వెల్లడించారు.