అంతర్జాతీయం

భారత దౌత్యవేత్తను పిలిపించిన పాకిస్తాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, ఫిబ్రవరి 15: పాకిస్తాన్ శనివారం ఇండియన్ హైకమిషన్‌కు చెందిన ఒక సీనియర్ దౌత్యవేత్తను పిలిపించి, నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) వెంట కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనలపై గట్టి నిరసన వ్యక్తం చేసింది. భారత భద్రతా బలగాలు ఫిబ్రవరి 14వ తేదీన నియంత్రణ రేఖ వెంట గల నేజాపీర్, రాఖ్‌చిక్రి సెక్టార్లలో సరిహద్దుల మీదుగా కాల్పులు జరిపాయని పాకిస్తాన్ విదేశాంగ శాఖ కార్యాలయం ఆరోపించింది. ‘ఎలాంటి కవ్వింపు చర్యలు లేకుండానే భారత భద్రతా బలగాలు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో ఫతేపూర్ గ్రామంలో ఒక 13ఏళ్ల బాలిక తీవ్రంగా గాయపడింది’ అని పాకిస్తాన్ విదేశాంగ శాఖ కార్యాలయం ఆరోపించింది. భారత బలగాలు ఎల్‌ఓసీ, వర్కింగ్ బౌండరీ వెంట పాకిస్తాన్‌లోని పౌర నివాస ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని ఫిరంగులు, మోర్టార్లు, ఆటోమాటిక్ ఆయుధాలతో కాల్పులు జరుపుతున్నాయని, ఈ కాల్పు లు ఇంకా కొనసాగుతున్నాయని ఆరోపించింది. ‘్భరత బలగాలు 2017 నుంచి అసాధారణ స్థాయిలో వరుసగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నాయని, అప్పటి నుంచి 1970 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించాయని, ఈ సంవత్సరం ఇప్పటి వరకు 287 సార్లు ఉల్లంఘించాయని పాకిస్తాన్ విదేశాంగ శాఖ కార్యాలయం ఆరోపించింది. భారత్ కాల్పు ల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం వల్ల ప్రాంతీ య శాంతికి, భద్రతకు ముప్పు పరిణమిం చే అవకాశం ఉందని పేర్కొంది. వ్యూహాత్మక పొరపాట్లకు అవకాశం ఉందని హితవు పలికింది. భారత్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని గౌరవించవలసిందిగా, ఎల్‌ఓసీ వెంట శాంతిని కాపాడవలసిందిగా తన బలగాలను ఆదేశించాలని పాకిస్తాన్ కోరింది.