అంతర్జాతీయం

‘సార్స్’ను మించిన మరణాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్: కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. చైనాలో ఇప్పటికే 811 మందిని బలిగొన్న ఈ వైరస్ 25 దేశాలకు పైగా వ్యాప్తించి ఆయా దేశాల పాలనా వ్యవస్థలను అట్టుడికిస్తోంది. 2002లో సంభవించిన ‘సార్స్’ వైరస్ వల్ల మృతి చెందినవారి కంటే కూడా ఈ తాజా వైరస్ వల్ల మరణించిన వారి సంఖ్య చాలా ఎక్కువగానే కనిపిస్తోంది. ఇప్పటివరకు 37 వేల మందికి ఈ వైరస్ సోకినట్టుగా నిర్ధారించారు. చైనాలో శనివారం ఒక్కరోజునే 89 మం ది మరణించడంతో ఆ వ్యాధి తీవ్రతపై జీ జిన్‌పిం గ్ ప్రభుత్వం ఏకంగా యుద్ధానే్న ప్రకటించింది. రోజువారీగా ఈ వైరస్‌కు సంబంధించి ఎప్పటికప్పుడు చైనా జాతీయ హెల్త్ కమిషన్ సమాచారాన్ని అందించడంతోపాటు దీని నివారణ, నిరోధనకు సంబంధించి అనేక దేశాలకు మార్గనిర్దేశనం చేస్తోంది. ఇప్పటికే చైనాలో 31 రాష్ట్రాల స్థాయి ప్రాంతాలకు ఈ వ్యాధి వ్యాపించినట్టుగా అధికారులు నిర్ధారించారు. 2002-03 సంవత్సరంలో ‘సార్స్’’ వైరస్ కూడా చైనాలోనే వ్యాపించి అనేక దేశాలకు వ్యాపించిన విషయం తెలిసిందే. ఆ వ్యాధి కారణంగా అప్పట్లో చైనాలో 700 మంది మరణిస్తే అతి స్వల్ప వ్యవధిలోనే కరోనా వైరస్ 811 మందిని బలిగొంది. తాజాగా మరణించిన 811 మందిలో 81 మంది ఈ వ్యాధి మూలకేంద్రం గా భావిస్తున్న హీబీ రాష్ట్రంలోనే మృతి చెందడం గమనార్హం. కాగా, కరోనా వైరస్ అనుమానంతో అనేక మందిని ప్రత్యేక శిబిరాల్లో ఉంచిన చైనా ప్రభుత్వం ఈ వ్యాధి లక్షణాలేవీ లేకపోవడంతో 600 మందిని విడుదల చేసింది. అయితే, ఈ వైరస్ సోకిన 6,188 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు చెబుతున్నారు. అదే క్రమంలో వివిధ ఆసుపత్రుల నుంచి 2,649 మందిని చికిత్సల అనంతరం విడుదల చేసినట్టు తెలుస్తోంది.