అంతర్జాతీయం

చైనీయుల భారత్ వీసాలు రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, ఫిబ్రవరి 4: కరోనా వైరస్ మరింత తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్న నేపథ్యంలో, చైనీయులు కలిగివున్న భారత్ వీసాలను కేంద్రం రద్దు చేసింది. ఈ విషయాన్ని చైనాలో భారత రాయబార కార్యాలయం మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. చైనీయుల వద్ద ఉన్న వ్యాలిడ్ వీసాలతోపాటు, గత రెండు వారాలుగా చైనాలో ఉంటున్న విదేశీయుల వద్ద ఉన్న భారత వీసాలను కూడా రద్దు చేసినట్టు ఈ ప్రకటన తేల్చిచెప్పింది. ఈనెల 2వ తేదీన ఈ-వీసాలను భారత్ తాత్కాలికంగా రద్దు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటూ, వ్యాలిడ్ వీసాలను రద్దు చేసింది. సెంట్రల్ చైనాలోని ఉహాన్ నుంచి కరోనా వైరస్ భారత్‌సహా మొత్తం 25 దేశాలకు వ్యాప్తి చెదిన విషయం తెలిసిందే. చైనా ప్రభుత్వం విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం సోమవారం 64 మంది ఈ వైరస్‌తో మృతి చెందారు. దీనితో మృతుల సంఖ్య 425కు చేరింది. వివిధ ఆసుపత్రుల్లో 20,438 మంది చికిత్స పొందుతున్నారు. పరిస్థితి తీవ్రతరమవుతున్న నేపథ్యంలో, చైనీయులు, అక్కడ ఉంటున్న ఇతర దేశాలకు వారి వ్యాలిడ్ వీసాలను రద్దు ప్రభుత్వం రద్దు చేసినట్టు భారత రాయబార కార్యాలయం పేర్కొంది. గత నెల 15వ తేదీ తర్వాత చైనాకు వెళ్లిన విదేశీయుల వీసాలు కూడా చెల్లవని, ఈ విషయంపై వివరాలకు భారత ప్రభుత్వ ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ హాట్‌లైన్ నంబర్ (+91-11239 780 46)ను సంప్రదించాలని సూచించింది. అదే విధంగా ncov2019"gmail.comను ఛూడవచ్చని పేర్కొం ది. వీసాల చెల్లుబాటు గురించి వివరాల కోసం చైనాలోని భారత రాయబార కార్యాలయాలను, కాన్సులేట్లను సంప్రదించాలని తెలిపింది. భారత వీసా కలిగిన పలువురు చైనీయులు వీసా చెల్లుబాటు వంటి పలు అంశాలపై సంప్రదిస్తున్నారని భారత రాయబార కార్యాలయం తన ప్రకటనలో తెలిపింది. అదే విధంగా ప్రస్తుతం చైనాలో ఉన్న విదేశీయులు భారత్‌కు రావడానికి అనుమతి కోరుతున్నట్టు చెప్పింది. ఇలాంటి ఏ ప్రశ్నలకైనా బీజింగ్ (visa.beijing" mea.gov.in), గాంగ్జూ(visa.guangzhou" mea.gov.in), షాంఘై(Ccons.shanghai" mea. gov.in)లోని భారత రాయబార కార్యాలయాలు, కాన్సులేట్లను సంప్రదించాలని వివరించింది. ప్రస్తుత వీసాలన్నీ రద్దయినట్టే భావించాలని, వీసాలు కావాలనుకునే వారు మళ్లీ కొత్తగా దరఖాస్తు చేసుకోవాలని భారత రాయబార కార్యాలయం తన ప్రకటనలో పేర్కొంది.
ఇలావుంటే, భారత్‌లో కరోనా వైరస్ బారిన పడిన వారి సంఖ్య మూడుకు పెరిగింది. వీరంతా ఇటీవలే చైనా నుంచి కేరళలోని తమతమ స్వస్థలాలకు చేరుకున్న వారే కావడం గమనార్హం.
ఆంక్షలు తీవ్రం.. వీధులు నిర్మానుష్యం..
కరోనా వైరస్‌పై యుద్ధ భేరి మోగించిన చైనా ప్రభుత్వం పలు కఠిన చర్యలను చేపట్టింది. అందులో భాగంగానే ఉహాన్ తదితర ప్రాంతాల్లో ఆంక్షలను తీవ్రతరం చేయడంతో, పలు నగరాల్లోని వీధులు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. చైటీ ఐటీ దిగ్గజం అలీబాబా కేంద్ర కార్యాలయం ఉన్న హాంగ్జూ జిల్లాలోని తైజూ పట్టణాన్ని పూర్తిగా దిగ్బంధించారు. రెండు రోజులకు ఒకసారి, ఒక్కో కుటుంబం నుంచి ఒకరిని మాత్రమే సరకులు, ఇతర వస్తువుల కొనుగోళ్లకు అధికారులు అనుమతిస్తున్నారు. మిగతా వారంతా ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు వీల్లేదు. కొనుగోళ్ల కోసం వచ్చే వారంతా తప్పనిసరిగా తమతమ ఐడీ ధ్రువీకరణ పత్రాలను చూపించాల్సి ఉంటుంది. పట్టణంలోని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్‌లను ధరించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఏమాత్రం నిర్లక్ష్యాన్ని ప్రదర్శించినా, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉహాన్ చుట్టుపక్కల సుమారు వంద కిలోమీటర్ల ప్రాంతాల్లోని పట్టణాలు, గ్రామాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతున్నది. ఫలితంగా ఎక్కడా జన సంచారమే కనిపించడం లేదు.
*చిత్రం... కరోనా వైరస్ మూల కేంద్రమైన చైనాలోని ఊహన్‌లో ఓ కనె్వన్షన్ సెంటర్‌ను తాత్కాలిక ఆసుపత్రిగా మార్చిన దృశ్యమిది. ఇక్కడ వందలాదిగా పడకలను ఏర్పాటు చేశారు