అంతర్జాతీయం

ఆ మదరసాలపై చర్యలేవీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్: పారిస్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద వ్యతిరేక అంతర్జాతీయ సంస్థ ‘ద ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్‌ఏటీఎఫ్) తాజాగా పాకిస్తాన్‌కు మరో 150 ప్రశ్నలు సంధించింది. పాకిస్తాన్ ఇదివరకే తనకు సమర్పించిన నివేదికలోని అంశాలకు సంబంధించి మరిన్ని వివరణలు కోరడంతో పాటు నిషిద్ధ ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉన్న మదరసాలపై తీసుకున్న చర్యల వివరాలను గణాంకాలతో సహా తెలియజేయవలసిందిగా ఆదేశించింది. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని, మనీలాండరింగ్‌ను అణచివేయడానికి తాను తీసుకున్న చర్యలను వివరిస్తూ ఎఫ్‌ఏటీఎఫ్‌కు ఒక నివేదికను సమర్పించిన కొన్ని వారాల తరువాత ఆ సంస్థ మరిన్ని వివరణలను కోరుతూ 150 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వవలసిందిగా ఆదేశించింది. పాకిస్తాన్‌ను ఇప్పటికే ‘గ్రే లిస్టు’లో చేర్చిన ఎఫ్‌ఏటీఎఫ్ దానిని 2020 ఫిబ్రవరి వరకు పొడిగించింది. 27 ప్రశ్నల జాబితాలోని మిగిలిన 22 అంశాలను అమలు చేయకుంటే ‘బ్లాక్ లిస్టు’లో పెడతానని ఎఫ్‌ఏటీఎఫ్ అక్టోబర్‌లోనే పాకిస్తాన్‌ను హెచ్చరించింది. దీంతో పాకిస్తాన్ 22 ప్రశ్నలకు సమాధానాలతో కూడిన ఒక నివేదికను డిసెంబర్ ఆరో తేదీన ఎఫ్‌ఏటీఎఫ్‌కు సమర్పించింది. ఈ నివేదికపై స్పందించిన ఎఫ్‌ఏటీఎఫ్‌కు చెందిన జాయింట్ గ్రూప్ తిరిగి పాకిస్తాన్‌కు 150 ప్రశ్నలను పంపించింది.
మరిన్ని వివరణలు, తాజా అంశాలను కోరడంతో పాటు ఇందులో ఎక్కువగా నిషిద్ధ ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన మదరసాలపై తీసుకున్న చర్యల గురించిన ప్రశ్నలు ఉన్నాయి. ఉన్నత స్థాయి అధికార వర్గాలను ఉటంకిస్తూ వెలువడిన ఒక వార్తాకథనం ఈ విషయాన్ని వెల్లడించింది. ఎఫ్‌ఏటీఎఫ్ ప్రతిస్పందన ఒక ఈ-మెయిల్ ద్వారా తమకు అందిందని అధికార వర్గాలు తెలిపాయి. 300 మదరసాలు, పాఠశాలలు సహా ముంబయిపై ఉగ్రవాద దాడి సూత్రధారి హఫీజ్ సరుూద్ నేతృత్వంలోని ఉగ్రవాద సంస్థ జమాత్ ఉద్ దావా (జేయూడీ) నెట్‌వర్క్‌పై తీసుకున్న చర్యల వివరాలను వెల్లడించవలసిందిగా ఎఫ్‌ఏటీఎఫ్ అడిగినట్టు అధికార వర్గాలు తెలిపాయి.