అంతర్జాతీయం

భారత్‌ను అడ్డుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, డిసెంబర్ 12: భారత ప్రభు త్వం తాజాగా చేపట్టిన పౌరసత్వ సవరణ బిల్లు లక్ష్యాలపై పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తీవ్ర విమర్శలు చేశారు. ట్వీట్లతో ప్రపంచ దేశాల ప్రమేయాన్ని కోరుతూ వ్యాఖ్యలు చేశారు. హిందూ జాత్యహంకార అజెండాతోనే మోదీ సర్కారు ఈ వివాదాస్పద బిల్లును తీసుకువచ్చిందని, పరిస్థితి చేయి దాటిపోకముందే ప్రపంచ దేశాలు జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌కు చెందిన ముస్లిమేతర మైనారిటీలకు పౌరసత్వాన్ని కల్పించేందుకు మోదీ ప్రభుత్వం ఈ బిల్లును తీసుకువచ్చిన విషయం తెలిసిందే. మోదీ అధికారంలోకి వచ్చినప్పటినుంచి కూడా ఓ వ్యూహం ప్రకారమే భారత్‌లో హిందుత్వ అమలవుతోందని ఇమ్రాన్ అన్నారు. పరిస్థితి ఇదే తరహాలో కొనసాగితే, ఇరు దేశాల మధ్య తీవ్ర స్థాయి సంఘర్షణలకు ఆస్కారం ఏర్పడుతుందని, అది రక్తపాతానికి దారితీయడమే కాకుండా దాని పర్యవసానం ప్రపంచ దేశాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఇమ్రాన్ అన్నారు. ఈ వాస్తవాన్ని గుర్తించి ప్రపంచ దేశాలు వెంటనే జోక్యం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఇదిలావుండగా, కాశ్మీర్ అంశంపై అంతర్జాతీయ వేదికలను ఉద్దేశించి మాట్లాడే భారత మంత్రుల ప్రకటనలను తాము భవిష్యత్తులో కూడా బహిష్కరిస్తామని పాకిస్తాన్ విదేశాంగ కార్యాలయం తెలిపింది. ఇటీవల టర్కీలో జరిగిన ఓ సమావేశంలో భారత మంత్రి ప్రసంగాన్ని తమ విదేశాంగ మంత్రి మహమ్మద్ ఖురేషీ బహిష్కరించిన విషయాన్ని ధృవీకరించింది.
*చిత్రం... పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్