అంతర్జాతీయం

పెన్షన్ నిబంధనల మార్పుపై హోరెత్తిన పారిస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పారిస్: పెన్షన్ విధానంలో ప్రభుత్వం నూతనంగా చేపడుతున్న సవరణలు, నిబంధనల్లో మార్పులపై అన్నివర్గాల ప్రజల నిరసనలతో పారిస్ హోరెత్తిపోయింది. కార్మికులు, ఉద్యోగులను నిలువుదోపిడీ చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వివిధ సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ఫ్రెంచ్ ప్రధాని ఎడార్డ్ ఫిలిప్ ఈ విషయంపై స్పష్టీకరిస్తూ రిటైర్మెంట్ వయసును మార్చలేదని తెలిపారు. 62 ఏళ్లకే రిటైర్మెంట్ ఉందని, అయితే పూర్తి పెన్షన్ రావాలంటే 64 ఏళ్లు పనిచేయాల్సి ఉంటుందని ఆయన వివరించారు. కాగా, ప్రధాని ప్రకటన పట్ల నిరసన వెల్లువెత్తింది. 1975 తర్వాత జన్మించిన వారికి మాత్రమే పెన్షన్ వర్తిస్తుందని ప్రభుత్వం ప్రకటించడాన్ని కార్మికులు, ఉద్యోగులు ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. గత వారం రోజులుగా కొనసాగుతున్న సమ్మెను ఆపేది లేదని, భవిష్యత్‌లో మరింత తీవ్రతరం చేస్తామని వారు తేల్చిచెప్పారు. ఇలావుంటే, పారిస్‌తోపాటు ఫ్రాన్స్‌లోని వివిధ నగరాలు, పట్టణాల్లో భారీ ప్రదర్శనలతో సాధారణ జనజీవనం స్తంభించిపోయింది. రవాణా కార్మికులు సైతం సమ్మెలో భాగస్వామ్యం కావడంతో మొత్తం రవాణా వ్యవస్థ అతలాకుతలం అయింది. పలు ప్రాంతాల్లో వేలాది మంది రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. స్థూలంగా చూస్తే దేశం మొత్తమీద 285 మైళ్లు లేదా 460 కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్ జామ్ ఏర్పడ్డాయని అధికార గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. సాధారణ ప్రజలు కూడా కార్మిక, ఉద్యోగుల సమ్మెకు మద్దతు ఇవ్వడంతో దేశంలో అనిశ్చితి నెలకొంది. దేశాధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్, ప్రధాని ఫిలిప్ ఎన్ని విజ్ఞప్తులు చేసినా పరిస్థితులు ఇంకా చక్కబడలేదు. పలు ప్రాంతాల్లో ఆందోళనకారులను చెదరగొట్టడానికి పోలీసులు బాష్పవాయు ప్రయోగం చేశారు. మరికొన్ని చోట్ల లాఠీ ప్రయోగం జరిగింది. ఫ్రెంచ్ రాజకీయాలపై ఈ సమ్మె ప్రభావం తీవ్రంగా ఉంటుందని విశే్లకులు అభిప్రాయపడ్డారు.