అంతర్జాతీయం

ప్రవాసుల్లో భారతీయులే అధికం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐక్యరాజ్య సమితి, నవంబర్ 28: ప్రపంచంలోని వివిధ దేశాల్లో ప్రవాసులుగా ఉంటున్న వారిలో భారతీయులే ఎక్కువ సంఖ్యలో ఉన్నారని ఐక్యరాజ్య సమితి (యూఎన్) నివేదక స్పష్టం చేసింది. తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం, 17.5 మిలియన్ల మంది భారతీయులు వివిధ దేశాల్లో ఉన్నారు. ఈ ఏడాది సుమారుగా 27 కోట్ల మంది ఇతర దేశాలకు వెళ్లారు.
అమెరికాకు వెళ్లిన వారి సంఖ్య చాలా ఎక్కువ. 5.1 కోట్ల మంది అమెరికాకు వెళ్లారు. ప్రపంచ జనాభాలో ప్రవాసులు కేవలం 3.5 శాతం మాత్రమే ఉన్నప్పటికీ, ఇది క్రమంగా పెరుతున్నది. ప్రతి దేశంలోనూ 96.5 శాతం మంది తమతమ దేశాల్లోనే ఉండడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రవాసుల్లో 14.1 కోట్ల మంది ఐరోపా ఖండంలో ఉన్నారు. భారత్ నుంచి 1.75 కోట్ల మంది వివిధ దేశాల్లో నివాసం ఉంటుండగా, ఆతర్వాతి స్థానాల్లో మెక్సికో (1.18 కోట్లు), చైనా (1.07 కోట్లు) ఉన్నాయి. అమెరికాలో స్థిరపడిన వారిలో భారతీయుల తర్వాత చైనాది రెండో స్థానం. ఆ దేశానికి చెందిన సుమారు 6.74 కోట్ల మంది అమెరికాలో ఉంటున్నారు.