అంతర్జాతీయం

బాధితులకు అవమానకరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, నవంబర్ 27: అమాయకులయిన 166 మందిని బలిగొనడంతో పాటు వారి కుటుంబాలను, ఆప్తులను శోకసంద్రంలో ముంచిన 2008 నాటి ముంబయిపై ఉగ్రవాద దాడికి బాధ్యులయిన కుట్రదారులకు ఇప్పటికీ శిక్ష పడకపోవడం బాధితులకు అవమానకరమని అమెరికా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి మైక్ పోంపియో పేర్కొన్నారు. 2008 నవంబర్ 26న ముంబ యి నగరంపై జరిగిన దాడి భారత దేశ చరిత్రలోనే అత్యంత భయంకరమయిన దాడులలో ఒకటిగా నిలిచిపోయింది. పాకిస్తాన్ నుంచి సముద్ర మార్గం గుండా ముంబయిలోకి చొరబడిన పది మంది లష్కర్ ఎ తోయిబా (ఎల్‌ఈటీ) సాయుధ ఉగ్రవాదు లు పాల్పడిన మారణకాండలో ఆరుగురు అమెరికన్లు సహా 166 మంది ప్రజలు మృతి చెందగా, 300కు పైగా మంది గాయపడ్డారు. మైక్ పోంపియో మంగళవారం నాడిక్కడ అమెరికా విదేశాంగ శాఖ కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడుతూ ఉగ్రవాదుల పిరికిపంద చర్య యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిందని అన్నారు. ‘ముంబయిపై ఉగ్రవాద దాడి జరిగి నేటికి 11 సంవత్సరాలు పూర్తయింది. దాడిలో మృతి చెందిన ఆరుగురు అమెరికన్లు సహా 166 మంది అమాయక ప్రజలను మనం స్మరించుకుంటున్నాం’ అని అన్నారు.