అంతర్జాతీయం

ప్రారంభోత్సవం రోజునా రుసుము చెల్లించాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 8: కర్తార్‌పూర్ కారిడార్‌ను ఉపయోగించుకునే భారతీయ యాత్రికుల విషయంలో పాకిస్తాన్ యూ-టర్న్ తీసుకుంది. శనివారం కర్తార్‌పూర్ కారిడార్ ద్వారా వచ్చి గురుద్వారా దర్బార్ సాహిబ్‌ను దర్శించుకునే భారతీయ సిక్కు యాత్రికులు ఒక్కొక్కరి నుంచి 20 డాలర్ల చొప్పున రుసుము వసూలు చేయనున్నట్టు పాకిస్తాన్ శుక్రవారం భారత్‌కు తెలియజేసిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కర్తార్‌పూర్ కారిడార్‌ను ప్రారంభించే నవంబర్ తొమ్మిదో తేదీన (శనివారం), సిక్కు మత వ్యవస్థాపకుడు గురు నానక్ 550వ జయంతి రోజయిన నవంబర్ 12న గురుద్వారా దర్బార్ సాహిబ్‌ను దర్శించుకునే యాత్రికులపై ఎలాంటి రుసుము విధించబోమని పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ గత వారం ప్రకటించారు. ఇమ్రాన్ ఖాన్ ప్రకటనను ప్రస్తావిస్తూ, ఈ రెండు రోజులు యాత్రికులకు రుసుము చెల్లింపు నుంచి మినహాయింపు ఇచ్చినట్టు పాకిస్తాన్ విదేశాంగ శాఖ కార్యాలయం గురువారం ధ్రువీకరించింది. భారత్‌లోని పంజాబ్‌లో గల డేరా బాబా నానక్ ఆలయాన్ని పాకిస్తాన్ పంజాబ్‌లోని నరోవల్ జిల్లాలో గల కర్తార్‌పూర్‌లోని దర్బార్ సాహిబ్‌ను ఈ కారిడార్ అనుసంధానం చేస్తుంది. శనివారం నుంచి యాత్రికులు ఈ కారిడార్‌ను ఉపయోగించుకునేందుకు వీలు కల్పిస్తున్నారు. కర్తార్‌పూర్ కారిడార్‌ను శనివారం ఉపయోగించుకునే యాత్రికులు కూడా 20 డాలర్ల చొప్పున రుసుము చెల్లించవలసి ఉంటుందని పాకిస్తాన్ భారత్‌కు తెలియజేసిందని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. అయితే, భారత్ నుంచి కర్తార్‌పూర్‌కు శనివారం అధికారికంగా వెళ్తున్న 550 మంది ప్రతినిధి బృందం కూడా రుసుము వసూలు చేస్తారా? అనే విషయం తెలియరాలేదని ఆ వర్గాలు వివరించాయి.