అంతర్జాతీయం

అభివృద్ధి పథాన కలిసి పయనిద్దాం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియాద్, అక్టోబర్ 30: ‘అభివృద్ధి పథాన కలిసి పయనిద్ధాం..’ అని భారత్-సౌదీ అరేబియా దేశా లు కీలక ఒప్పందాలు చేసుకున్నాయి. చమురు, సహాజ వాయువు, రక్షణ, విమాన రంగం వంటి డజనుకు పైగా కీలక అంశాలపై ఒప్పందం కుదుర్చుకున్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ సౌదీ అరేబియా పర్యటన సత్పలితాలను ఇస్తున్నది. భారత ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం సౌదీ రాజు సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్, యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల అధికారులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఇకమీదట కీలక అంశాలపై చర్చించేందుకు వీలుగా ఒక వ్యూహాత్మక పార్టనర్‌షిప్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. ఈ మేరకు ప్రధాని మోదీ, యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ సారథ్యంలో కౌన్సిల్ ఏర్పాటైంది. ఈ కౌన్సిల్ ప్రతి రెండేళ్ళకు ఒకసారి సమావేశం కావాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఉగ్రవాదాన్ని ఏ కోశాన సహించరాదని భావించారు. ఉగ్రవాద ఆవిర్భావ మూలాలకు ఎక్కడికక్కడ పెకిలించి వేయాలని నిర్ణయించారు. ఈ విషయంలో కూడా పరస్పరం సహకరించుకోవాలని ఇరు దేశాల నేతలు నిర్ణయం తీసుకున్నారు. ఉగ్రవాదం వల్ల అభివృద్ధికి ఆటంకం అవుతున్నదని ఇరు దేశాల నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఉగ్రవాదుల పట్ల తమ ప్రభుత్వం కఠినంగా వ్యవహారిస్తున్నదని మోదీ వారికి వివరించారు. తీవ్రవాదం, ఉగ్రవాదం వివిధ దేశాలకు పెను సవాల్‌గా పరిణమించిందని ఇరు దేశాల నేతలు ఆందోళన చెందారు. ఈ విషయాన్ని ఏదైనా నిర్థిష్ట జాతి, మతం లేదా సంస్కృతితో అనుసంథానించే ప్రయత్నాన్ని వారు తిరస్కరించారు. తీవ్రవాదం, ఉగ్రవాదాన్ని సమూలంగా అంతమొందించేందుకు ఇరు దేశాలు పరస్పరం సహకరించుకోవాలని, ఇందుకు అవసరమైన అత్యాధునిక పరికరాలను వినియోగించాలని భావించారు. ద్వైపాక్షిక ఒప్పందాల ప్రాముఖ్యతను, మార్గాల ప్రోత్సాహకానికి వారు అంగీకరించారు.
వంద బిలియన్ పెట్టుబడులు
భారత దేశంలో యుఎస్‌డి వంద బిలియన్లతో పెట్టుబడులు పెట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సౌదీ గత నెలలో ప్రకటించింది. విద్యుత్తు, రిఫైనింగ్, పెట్రోకెమికల్స్, ఇతర వౌలిక సదుపాయాల కల్పనలో ఈ పెట్టుబడులు పెట్టేందుకు సౌదీ సిద్ధంగా ఉంది. ఇలాఉండగా నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సౌదీలో ఇది రెండో పర్యటన.