అంతర్జాతీయం

సౌదీతో సహకారం భేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియద్, అక్టోబర్ 29: భారత్, సౌదీ అరేబియాలు తమ చుట్టుపక్కల నుంచి భద్రతాపరమైన ముప్పును ఎదుర్కొంటున్నాయని, అయితే కౌంటర్ టెర్రరిజం సహా భద్రతా అంశాలలో ఇరు దేశాల మధ్య పరస్పర సహకారం బాగా వృద్ధి చెందుతోందని భారతదేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కీలకమైన ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు, సౌదీ అరేబియా ఉన్నత స్థాయి నాయకత్వంతో చర్చలు జరిపేందుకు సోమవారం రాత్రి ఇక్కడికి చేరుకున్న మోదీ ‘అరబ్ న్యూస్’కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఈ విషయం చెప్పారు. ప్రధాని ఇంటర్వ్యూ మంగళవారం సంచికలో ప్రచురితమయింది. ‘్భరత్, సౌదీ అరేబియా వంటి ఆసియా దేశాలు తమ ఇరుగుపొరుగు నుంచి ఒకే విధమైన భద్రతాపరమైన ముప్పును ఎదుర్కొంటున్నాయని నేను విశ్వసిస్తున్నాను’ అని మోదీ అన్నారు. అయితే, ఆయన ఏ దేశం నుంచి భద్రతాపరమైన ముప్పు పొంచి ఉన్నదనే విషయాన్ని ప్రస్తావించలేదు. సౌదీ అరేబియా పాకిస్తాన్‌కు కీలక మిత్రదేశంగా కొనసాగుతోంది. పాకిస్తాన్ ఉగ్రవాదులను పెంచిపోషిస్తోందని దాని పొరుగు దేశాలు చాలాకాలంగా ఆరోపిస్తూ వస్తున్నాయి. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఒక ఉగ్రవాద సంస్థ 2016 జనవరిలో పఠాన్‌కోట్‌లోని భారత వాయుసేన స్థావరంపై దాడి చేసినప్పటి నుంచి భారత్.. పాకిస్తాన్‌తో చర్చలు జరపడం లేదు. చర్చలు, ఉగ్రవాదం కలిసి ముందుకు సాగలేవని భారత్ పేర్కొంటూ వస్తోంది. భారత్ ఆగస్టులో జమ్మూకాశ్మీర్‌కు ఉన్న స్వయంప్రతిపత్తిని తొలగించిన తరువాత ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు సరికొత్త దిగువ స్థాయికి దిగజారాయి. పాకిస్తాన్ తన దౌత్య సంబంధాలను తగ్గించుకోవడంతో పాటు భారత దౌత్యవేత్తను బహిష్కరించింది. కాశ్మీర్ అంశంపై సౌదీ అరేబియా మద్దతును కూడగట్టేందుకు పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ తరచుగా ఈ దేశాన్ని సందర్శిస్తున్నారు. ‘మా మధ్య సహకారం, ప్రత్యేకించి కౌంటర్ టెర్రరిజం, భద్రత, వ్యూహాత్మక అంశాలలో బాగా వృద్ధి చెందుతున్నందుకు నేను సంతోషిస్తున్నాను. మా జాతీయ భద్రతా సలహాదారు ఇటీవలి సౌదీ అరేబియా పర్యటన ఎంతో ఫలవంతమైంది’ అని నరేంద్ర మోదీ ‘అరబ్ న్యూస్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ‘మేము రక్షణ రంగ సహకారంపై ఒక సంయుక్త కమిటీని కలిగి ఉన్నాం. ఆ కమిటీ సమావేశాలు క్రమం తప్పకుండా జరుగుతున్నాయి. రక్షణ రంగం, భద్రతపై సహకారానికి సంబంధించి పరస్పరం ప్రయోజనం చేకూర్చే అనేక అంశాలను మేము గుర్తించాం’ అని మోదీ వివరించారు.
*చిత్రం...రియాద్‌లో ప్రసంగిస్తున్న భారత ప్రధాని మోదీ