అంతర్జాతీయం

ప్రజా హక్కులు పునరుద్ధరించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జెనీవా, అక్టోబర్ 29: జమ్మూకాశ్మీర్‌లో తాజా పరిస్థితి పట్ల ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది. కాశ్మీర్‌లోయ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలకు మానవ హక్కులే అందకుండా పోతున్నాయని, వాటిని తక్షణమే పునరుద్ధరించాలని భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఆగస్టు 5న కాశ్మీర్ ప్రత్యేక హోదాను రద్దు చేసినప్పటి నుంచి 86వ రోజైన మంగళవారం వరకు జనజీవనం స్తంభించిపోయిందని, అలాగే మార్కెట్లు కూడా మూతపడ్డాయని, ఘర్షణల కారణంగా రవాణా కూడా స్తంభించిపోయిందన్న కథనాలను ఉటంకించిన ఐక్యరాజ్యసమితి ‘కాశ్మీర్ ప్రజలకు మానవహక్కులు అందకపోవడం అన్నది ఆందోళన కలిగిస్తోంది. వెంటనే పరిస్థితి చక్కదిద్దాలి. ప్రజల హక్కులనూ పునరుద్ధరించాలి’ అని స్పష్టం చేసింది. కాశ్మీర్ పరిణామాలపై ఐరాస మానవహక్కుల కమిషనర్ రూపెర్ట్ పోల్ విల్లే మాట్లాడారు. ఇటీవలికాలంలో కొంతమేర ఆంక్షలను సడలించినప్పటికీ మానవహక్కులకు సంబంధించి వాటి ప్రభావం ఏమీ లేదని ఆయన స్పష్టం చేశారు.
జమ్మూ, లడఖ్‌లో చాలా ప్రాంతాల్లో అప్రకటిత కర్ఫ్యూను సడలించినప్పటికీ కాశ్మీర్‌లోయలోని చాలా ప్రాంతాల్లో ఇంకా అలాంటి పరిస్థితే ఉందని తెలిపారు. దీని కారణంగా ప్రజలు స్వేచ్ఛగా బయటకు వచ్చే పరిస్థితే లేకపోయిందని, వారి ఆరోగ్య, విద్య, మత స్వేచ్ఛలకు కూడా ఆటంకం కలుగుతోందని ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. అలాగే, చెదురుమదురుగా జరిగే నిరసనలపై కూడా మితిమీరిన స్థాయిలో అణచివేత చర్యలు చేపడుతున్నారన్న ఆరోపణలు కూడా వస్తున్నాయని ఆయన తెలిపారు.
ప్రజలు తమ దైనందిన కార్యకలాపాలు చేసుకోకుండా, విద్యార్థులు స్కూళ్లకు హాజరుకాకుండా కొన్ని సాయుధ బృందాలు కూడా బెదిరింపులకు పాల్పడుతున్నాయన్న కథనాలు కూడా తమ దృష్టికి వచ్చాయని రూపెట్ తెలిపారు.
అలాగే, ఈ సాయుధ బృందాల హెచ్చరికలను పట్టించుకోని ప్రజలపై దాడులకు పాల్పడుతున్నట్టు కూడా ఆరోపణలు వస్తున్నాయని తెలిపారు. రాష్ట్రానికి చెందిన ముగ్గురు మాజీ ముఖ్యమంత్రులు సహా వందలాదిమంది రాజకీయ, పౌర సమాజ నాయకులను నిర్బంధంలో ఉంచారని కూడా ఆయన గుర్తు చేశారు.