అంతర్జాతీయం

మన ప్రాణాలకే గతి లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాహోర్, అక్టోబర్ 28: పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్‌కు ప్రభుత్వపరంగా సాధ్యమైనంత వైద్య సౌకర్యాలు కల్పిస్తున్నామని ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. అయితే, ఎవరి జీవితంపై వారికే ఎలాంటి హామీ లేని పరిస్థితిలో ఇంకొకరి జీవితం గురించి ఎలా గ్యారంటీ ఇవ్వగలుగుతామని ఆయన అన్నారు. శరీరంలో రక్తకణాల సంఖ్య 20వేలకు పడిపోవడంతో 69 సంవత్సరాల షరీఫ్ పరిస్థితి విషమించింది. ఆయనకు ఊపిరి ఆడడం కూడా కష్టంగా మారింది. అయితే, షరీఫ్‌కు అత్యాధునికమైన వైద్య చికిత్సలు అందిస్తున్నామని, నిపుణులైన వైద్యులు ఆయన చికిత్స పొందుతున్న ఆసుపత్రిలో అందుబాటులో ఉన్నారని ఆయన తెలిపారు. నవాజ్ షరీఫ్ ప్రాణాలకు సంబంధించి కోర్టు అడిగిన ప్రశ్నకు ‘మనిషి చేసేది ప్రయత్నమే. మన జీవితాలకు సంబంధించి మనం ఒక దశ దాటిన తర్వాత ఎలాంటి హామీలు ఇవ్వలేము. ఇక ఇతరుల జీవితాలకు సంబంధించి ఏమి చెప్పగలుగుతాము’ అని ఇమ్రాన్ అన్నట్టుగా కథనాలు వెలువడ్డాయి. అల్ అజీజియా అవినీతి కేసులో ఇస్లామాబాద్ హైకోర్టు నవాజ్ షరీఫ్‌కు బెయిల్ మంజూరు చేసింది. అలాగే, అందుకు ఓ రోజు ముందు మనీ లాండరింగ్ కేసులో లాహోర్ హైకోర్టు ఆయనకు బెయిల్ ఇచ్చింది.

*చిత్రం...పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్