అంతర్జాతీయం

మోదీ పులిపై స్వారీ చేస్తున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, అక్టోబర్ 18: కాశ్మీర్ అంశంపై పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోసారి తన అక్కసును చాటుకున్నారు. 370-అధికరణ రద్దును మరోసారి తప్పుపట్టిన ఆయన రాష్ట్రంలో అమలవుతున్న ఆంక్షలను ఎత్తివేసిన మరుక్షణమే రక్తపాతం జరుగుతుందని హెచ్చరించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ పులిపై స్వారీ చేస్తున్నారని పేర్కొన్న ఆయన ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు 9 లక్షల మంది సైనికులు అవసరం లేదని, కాశ్మీర్ ప్రజలను భయభ్రాంతులు చేయడానికే భారత్ ఈ సైన్యాన్ని ఉపయోగించుకుంటున్నదని ట్విట్టర్‌లో విమర్శలు గుప్పించారు. కాశ్మీర్ ప్రజలకు సంఘీభావాన్ని ప్రకటిస్తూ పాకిస్తాన్ శుక్రవారం ‘కాశ్మీర్-డే’ను నిర్వహించింది. ఈ సందర్భంగా ట్వీట్ చేసిన ఇమ్రాన్ ఖాన్ కాశ్మీర్ లోయలో అమలు అవుతున్న ఆంక్షలను తప్పుపట్టారు. 370-అధికరణ రద్దు ద్వారా ఆ రాష్ట్ర ప్రత్యేక హోదాను తొలగించడంపైనా విమర్శలు గుప్పించారు. కాశ్మీర్‌పై అంతర్జాతీయంగా యాగీ చేయడాన్ని పాక్ చేసిన ప్రతి ప్రయత్నాన్ని భారత్ అడ్డుకుంటూ వస్తున్న నేపథ్యంలో ‘కాశ్మీర్-డే’ నిర్వహించారు. కాశ్మీర్‌పై మూడో దేశం జోక్యానికి ఆస్కారమే లేదని, ఇది ద్వైపాక్షిక అంశమని భారత్ అనేక సందర్భాల్లో తెగేసి చెప్పిన విషయం తెలిసిందే.