అంతర్జాతీయం

నదీ జలాలను మళ్లిస్తే దాడిగానే పరిగణిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, అక్టోబర్ 17: నదీ జలాలను తమ దేశంలోకి రానివ్వకుండా భారత్ అడ్డుకొని, వాటిని మళ్లిస్తే, ఆ చర్యను దాడిగా పరిగణిస్తామని పాకిస్తాన్ స్పష్టం చేసింది. పశ్చిమాన ప్రవహిస్తున్న నదులపై తమకు పూర్తి హక్కులు ఉన్నాయని పేర్కొంది. ఇటీవల హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న మోదీ హిమాలయాల నుంచి నదీ జలాలు పాకిస్తాన్‌కు వెళ్లకుండా చేస్తామని హెచ్చరించడంపై పాక్ తీవ్రంగా స్పందించింది. అలాంటి ప్రయత్నాలను దాడిగా పరిగణించి, తగిన రీతిలో సమాధానం చెప్తామని పాకిస్తాన్ విదేశాంగ కార్యాలయ అధికార ప్రతినిధి మహమ్మద్ ఫైజల్ గురువారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో పేర్కొన్నారు. నిజానికి పశ్చిమంగా ప్రవహిస్తున్న మూడు నదీ జలాలపై సంపూర్ణ హక్కు పాకిస్తాన్‌కే ఉందని ఆయన అన్నారు. గంగా నదీ జలాల ఒప్పందం ప్రకారం, పాకిస్తాన్‌లో ప్రవహించే నీటిని అడ్డుకునే హక్కు భారత్‌కు లేదని స్పష్టం చేశారు. అలాంటి చర్యలు ఏవైనాసరే, ప్రతిఘటించి తీరుతామని అన్నారు.