అంతర్జాతీయం

మృతదేహంతో పోలీస్ స్టేషన్‌కు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శాన్‌ఫ్రాన్సిస్కో : భారత సంతతికి చెందిన ఓ ఎన్‌ఆర్‌ఐ తన కారులో శవాన్ని తీసుకుని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోవడం స్థానికంగా సంచలనం సృష్టించింది. తాను నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్‌లో మరో ముగ్గుర్ని కూడా హతమార్చినట్టు 53 ఏళ్ల ఐటీ ప్రొఫెషనల్ చెప్పడం పోలీసులను కూడా దిగ్భ్రాంతికి గురిచేసింది. రోజ్‌విల్లే పోలీస్ డిపార్ట్‌మెంట్ కెప్టెన్ జాషువా సైమన్ తెలిపిన వివరాల ప్రకారం..శంకర్ నాగప్ప హంగడ్ అనే వ్యక్తి తన కారులో ఓ శవాన్ని తీసుకువచ్చి పోలీసులకు లొంగిపోయాడు. అక్కడికి సుమారు 350 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన అపార్ట్‌మెంట్‌లో మరో ముగ్గుర్ని హతమార్చినట్టు నాగప్ప పోలీసులకు తెలిపాడు. దీంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే స్పందించారు. స్థానిక పోలీసుల సహాయంతో వివరాలు తెలుసుకున్నారు. పేర్లను వెల్లడించకపోయినప్పటికీ మృతుల్లో ఇద్దరు పెద్దవారు, మరో ఇద్దరు చిన్నారులు ఉన్నట్టు తెలుస్తోంది. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అంతేకాకుండా నాగప్పకు వీరితో దగ్గర సంబంధం ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. హత్యలకు గల కారణాలు మాత్రం తెలియరాలేదు. అయితే, ఈ సంఘటన స్థానికులను కదిలించివేసిందని, భయాందోళనలకు గురిచేసిందని పోలీస్ అధికారి సైమన్ వ్యాఖ్యానించారు. సుమారు 1.30 లక్షల మంది జనాభా ఉన్న వౌంట్ సష్తా పట్టణంలో ఇలాంటి దారుణం తనకు తెలిసినంతవరకు ఎన్నడూ జరగలేదని ఆయన స్పష్టం చేశారు. నాగప్ప మజ్డా-6 వాహనంలో వచ్చి, తన కారులో మృతదేహం ఉందని చెప్పినపుడు పోలీస్ స్టేషన్‌లోని అధికారులు దిగ్భ్రాంతికి లోనయ్యారని సైమన్ అన్నారు. అక్కడి పోలీస్ చీఫ్ ప్యారిష్ క్రాస్ వెంటనే ఈ విషయాన్ని నిర్ధారించుకున్నారని సైమన్ తెలిపారు. ఆ తర్వాత సమాచారం అందుకున్న తాము నాగప్ప నివాస ప్రాంత పరిధిలోని అధికారులను అప్రమత్తం చేశామని అన్నారు. వారి ద్వారా మరో ముగ్గురు మృతి చెందిన అంశాన్ని ధృవీకరించుకున్నట్టు ఆయన చెప్పారు. నార్త్ కాలిఫోర్నియా రికార్డులను పరిశీలించగా నాగప్ప ఫెడరల్ ట్యాక్స్ కింద 1,78,603 డాలర్లను చెల్లించాల్సి ఉందని స్పష్టమైనట్టు సైమన్ పేర్కొన్నారు. ఈ హత్యలకు ఇదే ప్రధాన కారణం అయి ఉండవచ్చునని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. విచారణ పూర్తయితే వాస్తవాలు బయటపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు.