అంతర్జాతీయం

వైద్య రంగంలో ముగ్గురికి నోబెల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్టాక్‌హోం, అక్టోబర్ 7: వైద్యరంగంలో విశేష కృషి చేసిన ముగ్గురు పరిశోధకులకు ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కారం ప్రకటించారు. మానవ శరీరంలో కణజాలం పనితీరు, ఆక్సిజన్ (ప్రాణవాయువు) లభ్యతపై పరిశోధనలు చేసిన అమెరికాకు చెందిన విలియమ కైలిన్, గ్రెగ్ సమెంజా, బ్రిటన్‌కు చెందిన పీటర్ రాట్‌క్లిఫ్‌కు సంయుక్తంగా ఈ అవార్డు ఇచ్చారు. ఈ మేరకు నోబెల్ కమిటీ సోమవారం పురస్కారం ప్రకటించింది. శరీరంపై కణాలు ఎలా స్పందిస్తాయి? ప్రాణవాయువు లభ్యతపై ముగ్గురు విశేష పరిశోధనలు
చేశారని జ్యూరీ వెల్లడించింది. ఈ నూతన పరిశోధనలు అనేమియా, కేన్సర్ తదితర వ్యాధులపై పోరాటానికి ఉపకరిస్తాయని వారన్నారు. కైలిన్ అమెరికాలోని హవార్డ్ హగేస్ మెడికల్ ఇనిస్టిట్యూట్‌లో పరిశోధకులు. అలాగే జాన్ హోప్‌కిన్స్ ఇనిస్టిట్యూట్‌లో రక్తనాళాల పరిశోధక విభాగానికి సెమెంజా డైరెక్టర్‌గా సేవలందిస్తున్నారు. లండన్‌లోని ఫ్రాన్సిస్ క్రిక్ సంస్థలో క్లీనికల్ రిసెర్చి విభాగానికి రాట్‌క్లిఫ్ డైరెక్టర్. ముగ్గురు పరిశోధకులకు తొమ్మిది మిలియన్ల స్వీడిష్ క్రోనోర్(914,000 యూఎస్ డాలర్లు) నగదు బహుమతిగా అందిస్తారు. స్టాక్‌హోంలో డిసెంబర్ 10న జరిగే ఓ కార్యక్రమంలో బహుమతి ప్రదానం ఉంటుంది. ప్రఖాత శాస్తవ్రేత్త ఆల్‌ఫ్రెడ్ నోబెల్ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటవుతోందని జ్యూరీ వెల్లడించింది. గత ఏడాది వైద్య రంగంలో ఇద్దరికి నోబెల్ అందజేశారు. రోగ నిర్ధారక నిపుణులైన జేమ్స్ అల్లీసన్(అమెరికా, తసుకు హోంజో(జపాన్) సంయుక్తంగా అవార్డు అందుకున్నారు. ఇలా ఉండగా ఫిజిక్స్ విభాగంలో నోబెల్ అవార్డును మంగళవారం జ్యూరీ ప్రకటించనుంది. రసాయనశాస్త్రంలో బుధవారం ప్రకటిస్తారు. నోబెల్ సాహితీ అవార్డు గురువారం వెల్లడిస్తారు. నోబెల్ శాంతి బహుమతి శుక్రవారం ప్రకటిస్తారు. ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని ఈనెల 14న వెల్లడిస్తారని జ్యూరీ తెలిపింది.
*చిత్రం...వైద్య రంగంలో ముగ్గురికి నోబెల్ బహుమతి ప్రకటిస్తూ వారి ఫోటోలను చూపుతున్న జ్యూరీ